Facebook Profile: ఫేస్‌బుక్ లో మీ ప్రొఫైల్ ఎవరు చూశారో తెలుసుకోవాలని ఉందా? ఇలా చేయండి.. చాలు!

|

Dec 07, 2021 | 11:07 AM

ఫేస్‌బుక్.. ఈ పేరు తలుచుకోకుండా రోజు గడవదు ఎవరికీ. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్ క్రేజే వేరు. సోషల్ మీడియా ప్లాట్ ఫార‌మ్‌లలో ఫేస్‌బుక్ స్థానం ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు.

Facebook Profile: ఫేస్‌బుక్ లో మీ ప్రొఫైల్ ఎవరు చూశారో తెలుసుకోవాలని ఉందా? ఇలా చేయండి.. చాలు!
Facebook Profile
Follow us on

Facebook Profile: ఫేస్‌బుక్.. ఈ పేరు తలుచుకోకుండా రోజు గడవదు ఎవరికీ. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్ క్రేజే వేరు. సోషల్ మీడియా ప్లాట్ ఫార‌మ్‌లలో ఫేస్‌బుక్ స్థానం ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు. చాలా మంది స్నేహితులతో చాట్ చేయడానికి, ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటానికి, వీడియోలను చూడటానికి ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తారు. ఫేస్‌బుక్ లో ఎవరైనా చేరిన తరువాత వారి ప్రొఫైల్ తయారు అవుతుంది. దీని ద్వారా ప్రపంచంలోని ఇతర ఫేస్‌బుక్ ఖాతాదారులతో స్నేహితులుగా మారవచ్చు. ఫేస్‌బుక్ లో ఎకౌంట్ ఉన్నవారికి రోజూ అనేక మంది నుంచి ఫ్రెండ్ రిక్వస్ట్స్ వస్తాయి. అదేవిధంగా ఫేస్‌బుక్ కూడా కొన్ని సజెషన్స్ ఫ్రెండ్స్ కోసం పంపిస్తుంది. అయితే, సాధారణంగా స్నేహితులుగా మారాలని అనుకునే వారు.. కొత్త స్నేహితాలను కనుగునే వారు ఫేస్‌బుక్ ప్రొఫైల్ చెక్ చేస్తారు.

అదేవిధంగా ఫేస్‌బుక్‌లో ఒకరి ప్రొఫైల్ ఫోటోలు మరొకరు చూసుకోవడం మామూలే. తరచుగా కొందరు ఇతర ప్రొఫైల్స్‌ను రహస్యంగా తనిఖీ చేస్తుంటారు. మీ ఫేస్‌బుక్(Facebook) ప్రొఫైల్‌ని ఎవరు చూశారో తెలుసుకోవాలని అనిపించడం సహజం. మీరు మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఎవరు చూశారో తెలుసుకోవాలంటే, మీరు ఒక సాధారణ ట్రిక్ ఉపయోగించాలి. ఈ ట్రిక్ మీ ఫేస్‌బుక్(Facebook) ప్రొఫైల్‌ని ఎవరు చూసారో క్షణాల్లో మీకు తెలియజేస్తుంది. మరి ఆ ట్రిక్ ఏమిటో తెలుసుకుందాం..

మీ Facebook ప్రొఫైల్‌ని ఎవరు చూసారో తెలుసుకోండి!

  • కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో మీ Facebook ఖాతాను తెరవండి.
  • తర్వాత స్క్రీన్‌పై ఫేస్‌బుక్ పేజీని తెరవండి.
  • ఇప్పుడు మౌస్‌తో కుడివైపు బటన్ క్లిక్ చేయండి.
  • ఇప్పుడు ఒక పాప్ అప్ విండోజాబితా ఓపెన్ అవుతుంది.
  • దీనిలో ఇన్స్పెక్ట్ ఎలిమెంట్(inspect eliment) సెలక్ట్ చేయండి.
  • అప్పుడు మీకు ఒక కోడ్ లాంగ్వేజీ తో ఉన్న పేజీ కనిపిస్తుంది.
  • అక్కడ మీరు కంట్రోల్ + ఎఫ్ (Control + F) బటన్స్ క్లిక్ చేయండి.
  • ఇప్పుడు సెర్చ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు BUDDY_ID అని నమోదు చేయండి.
  • ఇప్పుడు BUDDY_ID పక్కన 15 అంకెల ID కనిపిస్తుంది, దానిని కాపీ చేయండి.
  • తర్వాత Facebook.com/15-అంకెల ID అని టైప్ చేసి ఎంటర్ చేయండి.

అంతే మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఎవరు చూశారో మీకు వెంటనే తెలిసిపోతుంది.

ఇవి కూడా చదవండి: మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..