Russia Ukraine War: ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తీసుకొచ్చిన C-17 విమానం ప్రత్యేకత ఏమిటి..?

C 17 Aircraf: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాల (Russia Ukraine War) నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నాయి విమానాలు. అయితే బోయింగ్ సి-17..

Russia Ukraine War: ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తీసుకొచ్చిన C-17 విమానం ప్రత్యేకత ఏమిటి..?

Updated on: Mar 06, 2022 | 11:21 AM

C 17 Aircraf: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాల (Russia Ukraine War) నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నాయి విమానాలు. అయితే బోయింగ్ సి-17 విమానం (C 17 Flight)లో కూడా భారతీయులను తీసుకువచ్చారు. అన్ని విమానాలకంటే ఈ విమానం ఎంతో శక్తివంతమైనది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఒకటి. ఇప్పుడు ఇదే సి-17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి పంపే అవకాశం ఉంది. ఈ విమానంలో 4 శక్తివంతమైన ఇంజన్లు ఉన్నాయి. ల్యాండింగ్ సమయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు విమానానికి రివర్స్ గేర్ కూడా అందించారు. ఈ విమానం 1980-90లలో తయారు చేశారు.

ఈ విమానం 174 అడుగుల పొడవు, 170 అడుగుల వెడల్పు, 55 అడుగుల ఎత్తు ఉంటుంది. యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రకారం.. ఈ విమానం ఒకేసారి 77 టన్నుల బరువును మోయగలదు. అలాగే ఒకేసారి 150 మంది సైనికులను మోసుకెళ్లగలదు. ఈ విమానం ఒకే సమయంలో 3 హెలికాప్టర్లు, 2 ట్రక్కులు లేదా ట్యాంకులను కూడా మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఈ విమానం ల్యాండ్ కావడానికి 3500 అడుగుల పొడవైన రన్‌వే అవసరం అవుతుంది. కానీ 1500 అడుగుల పొడవైనా రన్‌వేపై ల్యాండ్ కాగలదు. ప్రపంచంలో యుఎస్, యుకె, భారతదేశం ఈ విమానాలను ఉపయోగిస్తాయి. అమెరికా నుంచి భారత్ విమానాలను కొనుగోలు చేసింది. భారతదేశం ఈ విమానాన్ని లేహ్ లడఖ్ మారుమూల ప్రాంతంలో కూడా ల్యాండ్ అయ్యింది. కరోనా కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపిణీ చేయడానికి దీనిని ఉపయోగించారు.

అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడం, ఆయుధాలను సరఫరా చేయడంలో గ్లోబ్‌మాస్టర్ సామర్థ్యాలు సాటిలేనివి. అందుకే ఆఫ్ఘనిస్తాన్‌పై తాలిబన్లు దాడి చేసి ఆధీనంలోకి తీసుకున్న సమయంలో ఆప్ఘన్లు, విదేశీయులతో సహా భారతీయులను రక్షించడానికి భారత్‌ ఈ విమానాన్ని ఉపయోగించింది. ఈ విమానంలో ముగ్గురు సిబ్బంది, ఇద్దరు పైలట్‌లు, ఒక లోడ్‌మాస్టర్‌ ఉంటారు. విమానాశ్రయంలో సరుకును లోడ్‌మాస్టర్ నిర్వహిస్తారు. ఈ విమానానికి పెద్ద డోర్లు ఉంటాయి. ఇందులో బస్సు, ట్యాంక్‌, ఇతర వాహనాలను సులభంగా ఎక్కించవచ్చు. అందుకే ఈ C-17 విమానాన్ని సైన్యానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

Mercedes Benz: మెర్సిడెస్‌ బెంజ్‌ నుంచి సరికొత్త కారు.. ధర వివరాలు

Insurance Premium: వాహనదారులకు షాక్‌.. మరింతగా పెరగనున్న ఇన్సూరెన్స్‌ ప్రీమియం ధరలు.. దేనికి ఎంతంటే..