
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మంగళవారం తన ప్రైమ్ టాక్సీ రేంజ్‌ను ప్రారంభించింది. ఈ కార్లతో వాణిజ్య మొబిలిటీ విభాగంలోకి ప్రవేశించింది. కంపెనీ ప్రైమ్ HB (హ్యాచ్‌బ్యాక్), ప్రైమ్ SD (సెడాన్) అనే రెండు మోడళ్లను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో రూ.5,000లతో ఈ కొత్త మోడల్స్‌ను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
రెండు మోడళ్లు పెట్రోల్, CNG ఎంపికలతో 1.2-లీటర్ కప్పా నాలుగు సిలిండర్ల ఇంజిన్‌ను ఉపయోగిస్తాయి. ఈ వాహనాలు కంపెనీ-ఫిటెడ్ CNG, స్పీడ్-లిమిటింగ్ ఫంక్షన్‌తో వస్తాయి. ఈ ఫ్యాక్టరీ-ఫిటెడ్ సిస్టమ్‌లపై హ్యుందాయ్ మూడు సంవత్సరాల వారంటీని అందిస్తుంది. ప్రైమ్ HB రూ.5,99,900 నుండి ప్రారంభమవుతుంది, ప్రైమ్ SD రూ.6,89,900 నుండి ప్రారంభమవుతుంది. కొత్త శ్రేణి ఫ్లీట్ ఆపరేటర్లు, టాక్సీ వ్యవస్థాపకుల కోసం హ్యుందాయ్ ఈ కొత్త మోడల్స్ తీసుకొచ్చినట్లు చెబుతోంది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, CEO తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. ఫ్లీట్ ఆపరేటర్లు, టాక్సీ డ్రైవర్లు గరిష్ట అప్‌టైమ్, తక్కువ నిర్వహణ ఖర్చులను అందించే వాహనాల కోసం చూస్తున్నారు. హ్యుందాయ్ ప్రైమ్ శ్రేణిని ఈ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని కచ్చితంగా అభివృద్ధి చేశారని తెలిపారు. రెండు వాహనాలు టాక్సీ, ఫ్లీట్ కార్యకలాపాల కోసం నిర్మించారు. ప్రైమ్ టాక్సీ రేంజ్ అట్లాస్ వైట్, టైఫూన్ సిల్వర్, అబిస్ బ్లాక్‌లో వస్తున్నాయి. ప్రైమ్ HB CNG మోడ్‌లో 27.32 కిమీ/కిలోను, ప్రైమ్ SD 28.40 కిమీ/కిలోను అందిస్తుందని హ్యుందాయ్ పేర్కొంది. నిర్వహణ ఖర్చు 100,000 కిమీ వరకు కిలోమీటరుకు 47 పైసలుగా లెక్కించారు.
రెండు మోడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగులు, వెనుక AC వెంట్లు, నాలుగు పవర్ విండోస్, డ్రైవర్ సీట్ ఎత్తు సర్దుబాటు, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, స్పీకర్లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, అత్యవసర స్టాప్ సిగ్నల్, 80 కిమీ/గం వద్ద కంపెనీ అమర్చిన స్పీడ్ లిమిటర్, వెనుక డీఫాగర్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVMలు, సెంట్రల్ లాకింగ్, ముందు వరుసలో వేగవంతమైన USB టైప్-C ఛార్జర్, ఫుట్‌వెల్ లైటింగ్ ఉన్నాయి. వెనుక సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్‌లు, కీలెస్ ఎంట్రీ ప్రైమ్ HBలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనుక కెమెరా, మూడు సంవత్సరాల వారంటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మరిన్ని ఆటోమెబైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి