Samsung Galaxy Z Fold 6 5G: బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్‌..

శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G 12జీబీ వరకు ర్యామ్, 512GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో 6.3 ఇంచెస్ అమోల్డ్ ప్యానెల్, 7.6 ఇంచెస్ ఇన్నర్ మెయిన్ స్క్రీన్ ఉన్నాయి. రెండు స్క్రీన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తాయి. ఈ ఫోన్‌ను అతి తక్కువ ధరతో మీ సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy Z Fold 6 5G: బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్‌..
Huge Discount On Samsung Galaxy Z Fold 6 5g

Updated on: Sep 14, 2025 | 4:14 PM

కొత్త ఫోన్ కొనాలనుకునేవారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. పండుగ సీజన్‌కు ముందే శామ్‌సంగ్ అదిరే డిస్కౌంట్స్ అందిస్తుంది. అత్యంత అద్భుతమైన ఫోల్డబుల్ ఫోన్లలో ఒకటైన శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. సాధారణంగా రూ. 1,64,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌ను ఇప్పుడు సుమారు రూ. 1,20,000 కన్నా తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్‌లో గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర

ప్రస్తుతం అమెజాన్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G రూ. 25,000 తగ్గింపు తర్వాత రూ. 1,24,999కి లభిస్తుంది. అంతేకాకుండా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనంగా 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీనితో ఫోన్ ధర రూ. 1,20,000 కంటే తక్కువకు తగ్గుతుంది. అలాగే, EMI ఆప్షన్ కూడా ఉంది. దీనితో నెలకు రూ. 6,060 నుండి సులభ వాయిదాలలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ – జీఎస్టీ ప్రయోజనాలు

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా మీరు గరిష్టంగా రూ. 42,350 వరకు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్‌ఛేంజ్ విలువ మీ పాత ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. వ్యాపార కొనుగోళ్లపై జీఎస్టీ ఇన్వాయిస్‌తో 28శాతం వరకు ఆదా చేసుకునే అవకాశం కూడా ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ Z Fold 6 స్పెసిఫికేషన్స్

ఈ ఫోన్ 6.3 ఇంచెస్ అమోల్డ్ ప్యానెల్, 7.6 ఇంచెస్ ఇన్నర్ మెయిన్ స్క్రీన్‌ను కలిగి ఉంది. రెండు స్క్రీన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తాయి. ఇది అద్భుతమైన వ్యూయింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3.

ర్యామ్ & స్టోరేజ్: 12జీబీ వరకు ర్యామ్, 512GB స్టోరేజ్

బ్యాటరీ: 4,400mAh బ్యాటరీ.

కెమెరా:

బ్యాక్ కెమెరాలు: 50MPప్రధాన కెమెరా, 12MPఅల్ట్రా వైడ్, 10MP టెలిఫోటో లెన్స్.

ముందు కెమెరాలు: సెల్ఫీల కోసం 10MP, 4MP కెమెరాలు.

మొత్తానికి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, ఈ భారీ తగ్గింపుతో శామ్‌సంగ్ Z ఫోల్డ్ 6ని కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..