NASA: అంతరిక్ష ప్రియులకు గుడ్ న్యూస్.. హబుల్ టెలిస్కోప్‌ను సరి చేసిన నాసా.

|

Jul 18, 2021 | 10:24 PM

నాసా గుడ్ న్యూస్ చెప్పింది. సాంకేతిక సమస్యతో నిలిచి పోయిన హబుల్ అంతరిక్ష టెలిస్కోప్​లో నెల రోజుల తర్వాత పరిష్కారమైంది. 2009లో వ్యోమగాములు అమర్చిన మరో కమాండ్ యూనిట్​ను...

NASA: అంతరిక్ష ప్రియులకు గుడ్ న్యూస్.. హబుల్ టెలిస్కోప్‌ను సరి చేసిన నాసా.
Hubble Space Telescope
Follow us on

నాసా గుడ్ న్యూస్ చెప్పింది. సాంకేతిక సమస్యతో నిలిచి పోయిన హబుల్ అంతరిక్ష టెలిస్కోప్​లో నెల రోజుల తర్వాత పరిష్కారమైంది. 2009లో వ్యోమగాములు అమర్చిన మరో కమాండ్ యూనిట్​ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నించినట్లు నాసా తెలిపింది. విజయవంతంగా బ్యాకప్ పరికరాలను ఇంజినీర్లు వినియోగంలోకి తీసుకొచ్చారని నాసా తెలిపింది. అంతా సవ్యంగా జరిగితే హబుల్ టెలిస్కోప్ కార్యకలాపాలు వెంటనే పునఃప్రారంభం అవుతాయని పేర్కొంది

జూన్ మధ్యలో ఈ అబ్జర్వేటరీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. 1980ల కాలం నాటి కంప్యూటర్​లో సమస్య వల్ల టెలిస్కోప్ నిలిచిపోయిందని నాసా తొలుత భావించింది. అయితే, బ్యాకప్ పేలోడ్ కంప్యూటర్ సైతం విఫలమైందని తర్వాత గుర్తించింది.ఐదు రిపేర్లు1990లో నాసా ఈ హబుల్ టెలిస్కోప్​ను ప్రయోగించింది. దీనికి ఇప్పటివరకు ఐదు సార్లు రిపేర్లు జరిగాయి. చివరిసారి 2009లో పలు మరమ్మతులను చేసింది నాసా. విశ్వం గురించి అధ్యయనం చేసేందుకు ఈ టెలిస్కోప్ పరిశోధకులకు విశేషంగా దోహదం చేసింది. 1.5 మిలియన్ పరిశీలనల్లో ఇది భాగమైంది. హబుల్​కు కొనసాగింపుగా ఈ ఏడాది చివర్లో ‘జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్​’ను ప్రయోగించాలని నాసా ప్రణాళికలు రూపొందించింది.

ఇవి కూడా చదవండి: Most Mysterious: షాంగ్రి-లా లోయ.. ఇది అంతు చిక్కని రహస్యం.. ఇంత వరకు ఎవరూ తేల్చని మర్మం..ఇది రెండో బెర్ముడా ట్రయాంగిల్

viral video: కుక్కలు వెంటాడితే ఇలా కూడా చేస్తారా.. యువతి చేసిన పని చూస్తే మతి పోవడం ఖాయం..