EV Charging: 5 నిమిషాల ఛార్జింగ్ తో.. 200 కిమీ ప్రయాణం.. ఎలక్ట్రిక్ వాహనాలకు Huawei సరికొత్త సాంకేతికత..

EV Charging: మీరు ఎలక్ట్రిక్ కారు, స్కూటర్‌ ఉపయోగిస్తున్నారా? వాటి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇబ్బంది పడుతున్నారా? గంటల సమయం ఛార్జింగ్ కోసం వెచ్చిస్తున్నారా? మీ కోసమే ఈ వార్త..

EV Charging: 5 నిమిషాల ఛార్జింగ్ తో.. 200 కిమీ ప్రయాణం.. ఎలక్ట్రిక్ వాహనాలకు Huawei సరికొత్త సాంకేతికత..
Ev Charging

Updated on: May 29, 2022 | 6:56 PM

EV Charging: మీరు ఎలక్ట్రిక్ కారు, స్కూటర్‌ ఉపయోగిస్తున్నారా? వాటి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇబ్బంది పడుతున్నారా? గంటల సమయం ఛార్జింగ్ కోసం వెచ్చిస్తున్నారా? మీ సమస్యలకు Huawei కంపెనీ కొత్త ప్రకటన పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ చైనీస్ కంపెనీ అలాంటి సాంకేతికతపై పని చేస్తోంది. కంపెనీ తెస్తున్న సాంకేతికత వల్ల మీరు మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని 200 కి.మీ ప్రయాణం కోసం కేవలం 5 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే సరిపోతుందని కంపెనీ చెబుతోంది.

చాలా మంది ఇప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రయాణానికి ఎంచుకోకపోవటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ దూరం ప్రయాణించేందుకు వీలు ఉండటమే. దీనికి తోడు ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టం మరో పెద్ద కారణంగా చెప్పుకోవాలి. Huawei ప్రయోగం విజయవంతమైతే.. ఈ ఛార్జింగ్ పరిష్కారం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. కంపెనీ ఎల్లప్పుడూ తన వినియోగదారుల కోసం గొప్ప ఉత్పత్తులు, సేవలను అందించడానికి ప్రయత్నిస్తుందని సంస్థ సీనియర్ అధికారి వాంగ్ చావో చెప్పారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లో 1000V EV ఛార్జింగ్ సొల్యూషన్ అత్యాధునిక సాంకేతికతతో పరిచయం చేయనుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాన్ని 5 నిమిషాల పాటు ఛార్జింగ్ చేస్తే 200 కి.మీ ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. 2025 నాటికి 1000V 600kw అధిక-వోల్టేజ్ ఛార్జింగ్ సహాయంతో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీని 5 నిమిషాల్లో 30 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవనున్నాయి.