ఫేస్ బుక్, ట్వీటర్, ఇన్ స్టాగ్రామ్ వంటి ఇతర సామాజిక మాధ్యమాల్లో సులువుగా లాగవుట్ చేసి తిరిగి లాగిన్ అవ్వడం ద్వారా వివిధ ఖాతాల నిర్వహణ సులభం అవుతుంది. కానీ వాట్సాప్ లో లాగవుట్ చేసి లాగిన్ చేయడం అంత సులభం కాదు. కానీ కొన్ని పద్ధతులను ఫాలో అవ్వడం ద్వారా ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ లను ఉపయోగించవచ్చు. ఇలా ఏ యాప్ అయినా రెండు ఒకే మొబైల్ లో వాడుకోవచ్చు. దాన్నే పారలల్ స్పేస్ అని అంటారు.ఈ పారలల్ స్పేస్ ని వాడటం రెండు రకాలుగా సాధ్యపడుతుంది. ఒకటి ఫోన్ లో ఇన్ బిల్ట్ గా పారలల్ స్పేస్ ఉండటం, రెండూ పారలల్ యాప్స్ అందించే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడం.
కొన్ని కంపెనీల ఫోన్లలో డ్యూయల్ యాప్స్ ఉపయోగించేందుకు ప్రత్యేకమైన ఆప్షన్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించడం ద్వారా ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ ఖాతాలు ఉపయోగించవచ్చు. షావోమి ఫోన్లలో అయితే ‘Dual apps’, శాంసంగ్ లో ‘Dual Messenger’, ఒప్పోలో ‘Clone apps’, వివోలో ‘App Clone’, అసుస్ లో ‘Twin apps’, హువావే, హానర్ ఫోన్లలో అయితే ‘App twin’ ఫీచర్లను ఉపయోగించి రెండో వాట్సాప్ ఖాతాను ఉపయోగించవచ్చు.
ఒకవేళ మీరు పైన పేర్కొన్న ఫోన్లు కాకుండా వేరే ఫోన్లు ఉపయోగిస్తున్నట్లయితే, ప్లేస్టోర్ లో లభించే Parellel space, Dual App Wizard, Double App వంటి యాప్ ల ద్వారా మీ యాప్ ను క్లోన్ చేసుకుని రెండో వాట్సాప్ ఖాతాను ఉపయోగించవచ్చు.
ఐఫోన్ వినియోగదారులకు ఇలా డ్యూయల్ యాప్ ద్వారా వాట్సాప్ ను ఉపయోగించే అవకాశం లేదు కానీ, వాట్సాప్ బిజినెస్ అని యాప్ స్టోర్ లో ఒక యాప్ ఉంటుంది. అదే యాప్ ప్లేస్టోర్ లో కూడా ఉంటుంది కానీ, ఆండ్రాయిడ్ వినియోగదారులకు దీన్ని ఉపయోగించేంత అవసరం రాదు. కానీ ఐవోఎస్ వినియోగదారులకు మాత్రం రెండో వాట్సాప్ ఖాతా కావాలంటే ఇది ఉపయోగించక తప్పదు. కాబట్టి ఐవోఎస్ లో రెండో వాట్సాప్ ఖాతా కావాలంటే యాప్ స్టోర్ లోకి వెళ్లి Whatsapp Business యాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి.
ఎలాంటి థార్డ్ పార్టీ యాప్ సహాయం లేకుండా పారలల్ స్పేస్ ని వాడటం XIAOMI MI ఫోన్స్ లో సాధ్యపడుతుంది.మీరే గనుక షియోమి ఫోన్ వాడుతోంటే , అందులో MIUI-8 రన్ అవుతోంటే సెకన్లలో వాట్సాప్ రెండొవ ఖాతా తెరవొచ్చు.ఒకటి Settings లొకి వెళ్ళి System & Device సెట్టింగ్స్ లో ఉండే Second Space ని ఆన్ చేయడం ద్వారా.ఇది ఆన్ చేయగానే మీ మొబైల్ లో సెకండ్ స్పేస్ వచ్చేస్తుంది.ఆ స్పేస్ లో మీరు అన్ని యాప్స్ ని రెండొవసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
స్పేస్ మొత్తాన్ని ప్రైవేట్ గా వాడుకోవచ్చు.అలా కాకుండా, దాని కిందే Device సెక్షన్ లో ఉండే Dual Apps లో మీకు ఇష్టం వచ్చిన యాప్ ని డూప్లికేట్ చేసుకోవచ్చు.ఇక మీద దగ్గర షియోమి ఫోన్ లేకపోయినట్లయితే, స్టోర్ లో రెండేసి యాప్స్ అందించే యాప్స్ బాగానే దొరుకుతున్నాయి. అందులో Parallel Space అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోని ఇష్టమైన యాప్స్ ని డూప్లికేట్ చేసుకోండి.