
మనకు తెలిసినవారికి, బంధువలకు వాట్సప్ ద్వారా ఫోటోలు పంపిస్తుంటాం. అయితే మనం పంపించిన ఫోటో చాలా పూర్‌గా ఉన్నాయనే ఎదుటివారి రిజక్ట్ చేస్తుటారు.ఇలాంటి సమయంలో మనకు ఏం చేయాలో అర్థం కాదు. వాట్సప్ నుంచి వాట్సాప్ ద్వారా చిత్రాలను పంపేటప్పుడు స్పష్టత ఉండదని మనం చాలా సార్లు వింటూ ఉంటాం. చాలా మంది చిత్రాలను డాక్యూమెంట్ మోడ్‌లో పంపించడం ద్వారా ఈ సమస్యను చెక్ పెడుతుంటారు.
అయితే వాట్సాప్ కొత్త అప్‌డేట్‌తో ఈ సమస్యను పరిష్కరించింది. చిత్రాలను ఇప్పుడు HD రిజల్యూషన్‌లో పంపవచ్చు. ఫీచర్ త్వరలో వీడియోలకు కూడా అందుబాటులో ఉంటుంది. మెటా -యాజమాన్య సంస్థ ద్వారా HD వీడియో -షేరింగ్ సామర్ధ్యం త్వరలో అందుబాటులోకి రానుంది.
ఇందుకోసం ముందుగా వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఆ తర్వాతే మీరు హెచ్‌డీ క్వాలిటీలో చిత్రాలను పంపించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి సమయంలో ముందుగా మీరు ఉపయోగిస్తున్న వాట్సప్‌ను ఓ సారి అప్‌డేట్ చేస్తే సరిపోతుంది. వెంటనే మీ వాట్సప్ నుంచి హెచ్‌డీ క్వాలిటీలో ఫోటోలను పంపించుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..
ఇదిలావుంటే, మరో అప్‌డేట్ గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్‌లను నిశ్శబ్దం చేసే ఫీచర్, నకిలీలను చెక్ పెట్టేందుకు, స్కామర్‌ల నుంచి వినియోగదారులను రక్షించడానికి వాట్సప్ అనేక కొత్త ఫీచర్‌లను తీసుకొచ్చింది. డెవలపర్లు కొత్త భద్రతా పరికరాలను పరీక్షిస్తున్నారని వెబ్ బెటా ఇన్ఫో ఇటీవలి చాలా రిపోర్టులను తెలిపింది. ఇది వినియోగదారులు సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది. తెలియని నంబర్ల నుంచి మెసెజ్ వస్తే చూడటం చేయకండి.
మీ ఫోన్ కాంటాక్ట్ నెంబర్లలోని వారి నుంచి లేదా మీరు ఇంతకు ముందు మాట్లాడని వారి నుంచి మీకు మెసెజ్ వచ్చినప్పుడు.. మీకు తెలియని నంబర్ నుంచి మెసెజ్ వచ్చినప్పుడు మీరు ఏం చేయగలరో వివరిస్తూ కొత్త భద్రతా పరికరాల పాప్-అప్ కనిపిస్తుంది. కాంటాక్ట్‌ను బ్లాక్ చేసే లేదా రిపోర్ట్ చేసే ఆప్షన్‌తో పాటు, ప్రొఫైల్ ఫోటోలు, ఫోన్ నంబర్‌లు, కంట్రీ కోడ్‌లను చెక్ చేయడం ద్వారా చాట్‌లో సురక్షితంగా ఎలా ఉండాలనే దానిపై కొంత సమాచారాన్ని కూడా వాట్సప్ అందిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..