
మీ ఫ్రెండ్ బర్త్ డే ఉందా..? మీ రోజువారీ వర్క్ టాస్క్‌లు గుర్తు పెట్టుకోవాలా..? ఏదైనా స్పెషల్ తేదీల్లో మీరు చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? మీరు వాటిని గుర్తుంచుకోలేక మిస్ అవ్వుతున్నారా..? అయితే మీ కోసం అదిరిపోయే ఫీచర్ ఒకటి ఉంది. అదే వాట్సప్ మెస్సేజెస్ షెడ్యూలింగ్. మీ ఫ్రెండ్ బర్త్ డే ఉన్నప్పుడు రాత్రి 12 గంటలకు అలారం పెట్టుకుని లేవాల్సిన పని లేదు. వర్క్‌కి సంబంధించిన మెస్సేజ్‌లను వేరే పనుల్లో ఉన్నప్పుడు మధ్యలో గుర్తు చేసుకుని పంపాల్సిన అవసరం ఉండదు. మీరు అనుకున్న టైమ్‌కి షెడ్యూల్ ఆప్షన్ ద్వారా మెస్సేజెస్ పంపవచ్చు. అదెలానో చూడండి
వాట్సప్ మెస్సేజెస్ షెడ్యూల్ చేయడానికి వాట్సప్‌లో ఎలాంటి అంతర్గత ఫీచర్ ఇంకా రాలేదు. వీడియో, వాయిస్ కాల్స్ షెడ్యూలింగ్ చేసుకునే ఫీచర్ వాట్సప్‌లో అందుబాటులో ఉంది తప్ప.. మెస్సేజెస్ షెడ్యూలింగ్ ఆప్షన్ లేదు. కానీ నమ్మకమైన, అత్యంత ప్రజాదరణ పొందిన SKEDit అనే యాప్ ద్వారా మీరు మెస్సేజెస్ వాట్సప్‌లో షెడ్యూల్ చేయవచ్చు. వాట్సప్‌నే కాకుండా ఇందులో ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రాంలో కూాడా మెస్సేజ్‌లు షెడ్యూల్ చేసుకోవచ్చు.
-SKEDit అనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి
-మీ మెయిల్ ఉపయోగించి యాప్‌లో లాగిన్ అవ్వండి
-అందులో మెయిన్ స్క్రీన్‌పై కనిపించే వాట్సప్ ఐకాన్‌పై క్లిక్ చేయండి
-కుడివైపు ఉన్న ప్లస్ అనే సింబల్‌పై క్లిక్ చేయండి
-వాట్సప్‌ను ఎంచుకుని అనుమతుల ప్రక్రియ పూర్తి చేయండి
-మీళ్లీ ప్లస్ సింబల్‌ను క్లిక్ చేసి కాంటాక్ట్ నెంబర్‌ను ఎంచుకోండి
-మెస్సేజ్ బాక్స్‌లో మీ మెస్సేజ్ టైప్ చేసి తేదీ, టైమ్ ఎంచుకోండి
-ఆ తర్వాత షెడ్యూల్ ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది