AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సాప్‌లో డిలిట్ అయిన మెసేజ్‌లను ఈ సింపుల్ ట్రిక్స్‌తో రికవరీ..

మీరు పొరపాటున ముఖ్యమైన వాట్సాప్ మెసేజ్‌ను డిలీట్ చేశారా.. అయితే టెన్షన్ అక్కర్లేదు. కొత్త ఫీచర్‌తో కేవలం ఒక్క క్లిక్‌తో మెస్సేజ్‌ను వెంటనే రీస్టోర్ చేయవచ్చు. ఒకవేళ మొత్తం చాట్‌లు డిలీట్ అయినా బ్యాకప్‌తో మళ్లీ మెస్సేజులను పొందొచ్చు. అంతేకాదు త్వరలో రాబోయే యూజర్‌నేమ్ ఆధారిత కమ్యూనికేషన్ ఫీచర్ ద్వారా ఇకపై నంబర్ అవసరం లేకుండానే కాల్స్ మెసేజ్‌లు చేసుకోవచ్చు.

WhatsApp: వాట్సాప్‌లో డిలిట్ అయిన మెసేజ్‌లను ఈ సింపుల్ ట్రిక్స్‌తో రికవరీ..
How To Recover Deleted Whatsapp Messages
Krishna S
|

Updated on: Nov 10, 2025 | 5:43 PM

Share

ఈ రోజుల్లో వాట్సాప్ మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఏం మాట్లాడాలన్నా వాట్సాప్‌లోనే.. చాటింగ్, ఫోటోలు షేర్ చేయడం నుండి ముఖ్యమైన పత్రాలు పంపడం వరకు అన్నీ ఈ యాప్‌లోనే.. కానీ కొన్నిసార్లు తొందరపాటులోనో, అనుకోకుండానో ముఖ్యమైన మెసేజ్‌లు లేదా మొత్తం చాట్‌లే డిలిట్ అవుతాయి. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే ఇక చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ తొలగించిన వాట్సాప్ సందేశాలను తిరిగి పొందడానికి సులభమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

అద్భుతమైన అన్‌డు డిలీట్ ఫర్ మీ ఫీచర్

వాట్సాప్ ఇటీవలే ప్రవేశపెట్టిన అత్యంత ఉపయోగకరమైన ఫీచర్లలో ఒకటి అన్‌డు డిలీట్ ఫర్ మీ. మీరు అనుకోకుండా ఒక సందేశాన్ని డిలీట్ చేసినప్పుడు.. స్క్రీన్ దిగువన కొన్ని సెకన్ల పాటు Undo ఆప్షన్ కనిపిస్తుంది. ఆ Undo బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు తొలగించిన సందేశాన్ని తక్షణమే పునరుద్ధరించవచ్చు. తొందరపాటులో తప్పు చేసేవారికి లేదా ముఖ్యమైన మెసేజ్‌లను పొరపాటున డిలీట్ చేసేవారికి ఈ ఫీచర్ ఒక వరంగా చెప్పవచ్చు.

క్లౌడ్ బ్యాకప్ ద్వారా చాట్‌ల పునరుద్ధరణ

ఒకవేళ మీరు పొరపాటున చాట్‌లను పూర్తిగా తొలగించినా Undo ఆప్షన్ సమయం మించిపోయినా చింతించాల్సిన అవసరం లేదు. వాట్సాప్ యొక్క బ్యాకప్ ఫీచర్ మీకు సహాయపడుతుంది.

వాట్సాప్ సాధారణంగా ప్రతిరోజూ మీ చాట్‌లను Google డిస్క్ లేదా iCloudకు ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేస్తుంది.

ఈ దశలను అనుసరించండి:

ముందుగా మీ ఫోన్ నుండి వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి. మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి, OTP ధృవీకరణ పూర్తి చేయండి. లాగిన్ అయిన వెంటనే బ్యాకప్‌ రీస్టోర్ అనే అవకాశాన్ని యాప్ మీకు అందిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మీ పాత చాట్‌లు, మీడియా ఫైల్‌లు కొన్ని నిమిషాల్లో తిరిగి వచ్చేస్తాయి.

బ్యాకప్‌తో కూడా సాధ్యమే

మీరు క్లౌడ్ బ్యాకప్‌ ఆన్ చేయకపోయినా, వాట్సాప్ మీ ఫోన్ స్టోరేజీలో బ్యాకప్ ఫైళ్లను సేవ్ చేస్తుంది.

  • ఫైల్ మేనేజర్ లేదా ఫైల్స్ యాప్‌లోకి వెళ్లండి.
  • WhatsApp → Databases ఫోల్డర్‌ను తెరవండి.
  • ఇటీవలి బ్యాకప్ ఫైల్‌ను (ఉదాహరణకు.. msgstore.db.crypt14 వంటి ఫైల్‌) ఎంచుకుని, దానిని రీస్టోర్
  • చేయండి. ఈ పద్ధతి ద్వారా కూడా పాత మెస్సేజులను తిరిగి పొందవచ్చు.

యూజర్ నేమ్‌తో కాల్స్

వాట్సాప్‌లో అతి త్వరలో ఒక విప్లవాత్మక కొత్త ఫీచర్ రాబోతోంది. దీని ద్వారా ఎవరికైనా కాల్ చేయడానికి లేదా మెసేజ్ చేయడానికి ఫోన్ నంబర్ అవసరం లేకుండా పోతుంది. ఇకపై మీరు మీ మొబైల్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్ ఉపయోగించి వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ చేయవచ్చు. కాల్ చేయవచ్చు. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత మీ మొబైల్ నంబర్ అపరిచితుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం తగ్గుతుంది. తద్వారా మీ ప్రైవసీకి డోకా ఉండదు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ