Car Mileage: మీ కారు మైలేజీ ఇవ్వడం లేదా.. ఒక్కసారి వీటిని పాటించి చూడండి..!

|

Apr 29, 2022 | 9:27 AM

Car Mileage: ప్రతి ఒక్కరూ తన కారు మంచి మైలేజీని ఇవ్వాలని కోరుకుంటారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ప్రజల్లో చాలా

Car Mileage: మీ కారు మైలేజీ ఇవ్వడం లేదా.. ఒక్కసారి వీటిని పాటించి చూడండి..!
Car Mileage
Follow us on

Car Mileage: ప్రతి ఒక్కరూ తన కారు మంచి మైలేజీని ఇవ్వాలని కోరుకుంటారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. కార్ల తయారీదారులు కూడా మెరుగైన మైలేజీపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో వినియోగదారులు ధరతో పాటు మైలేజికీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం బీఎస్4 నుంచి బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా వాహన సంస్థలు మార్పులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్ తయారుచేస్తున్నాయి. అయితే కొన్ని పద్దతులు పాటించడం ద్వారా కారు మైలేజీని పెంచుకోవచ్చు. అలాంటి కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

1. ACని పొదుపుగా వాడండి

మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిత్యం ఏసీ ఆన్‌లో ఉంటే మైలేజీ దెబ్బతింటుంది. మీరు ఈ అలవాటును వదులుకోవాలి ఎందుకంటే AC రన్ చేయడం వల్ల కారు మైలేజీని 30 శాతం వరకు తగ్గుతుంది. నివేదికల ప్రకారం మీరు ఫుల్ ట్యాంక్ ఇంధనంతో AC ఆన్‌లో పెట్టుకొని 500 కి.మీ ప్రయాణిస్తే AC ఆఫ్ చేయడం ద్వారా 600 నుంచి 625 కి.మీ ప్రయాణించవచ్చు.

2. కారు మెయింటనెన్స్‌

కారు పనితీరుకు రెగ్యులర్ సర్వీస్ అవసరం. ఇది మంచి మైలేజ్‌ ఇవ్వడానికి సహాయపడుతుంది. క్లీన్ ఎయిర్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్ మీ కారు ఇంధన మైలేజీని పెంచుతాయి. ఒకవేళ ఎయిర్ ఫిల్టర్ సరిగ్గా లేకుంటే ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుందని గుర్తుంచుకోండి.

3. ఎక్కువ ఇంధనం ఉంటే తక్కువ మైలేజీ

మీ కారులో ఎక్కువ ఇంధనం ఉంటే కారు మైలేజ్ తగ్గుతుంది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. వాస్తవానికి కారుపై ఎక్కువ లోడ్ ఉంటే ఇంధన వినియోగం పెరుగుతుంది. అందుకే సగం నిండిన ట్యాంక్ కారు మైలేజీని పెంచుతుంది.

4. వివేకంతో డ్రైవ్ చేయటం

మితిమీరిన వేగం, అనవసరమైన యాక్సిలరేషన్, అసందర్భ బ్రేకింగ్‌లను తగ్గించుకోగలిగినట్లయితే, ఇంధన వినియోగం తగ్గి మైలేజ్ పెరుగుతుంది. హైవేలపై ఎక్కువ వేగంతో వెళ్లటం వలన సుమారు 30 శాతానికి పైగా మైలేజ్‌ను కోల్పోవటం జరుగుతుంది. అలాగే, సిటీ రోడ్లపై అనవసర బ్రేకింగ్, యాక్సిలరేషన్ కారణంగా సుమారు 5 శాతం మైలేజ్‌ను కోల్పోవటం జరుగుతుంది.

5. టైర్లలో సరిపడ గాలి

అన్ని టైర్లలో గాలి పీడనం సరిగ్గా ఉందో లేదో బయలుదేరే ముందే చూసుకోవాలి. టైర్లలో నిర్దేశిత మోతాదు కన్నా తక్కువ గాలి ఉన్నట్లయితే, రన్నింగ్ లోడ్ పెరిగి మైలేజ్ భారీగా తగ్గిపోయే ఆస్కారం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022: ఆయన నాకు అన్నయ్య లాంటివాడు.. మా ఇద్దరి మధ్య ఎలాంటి పోటీ లేదు..!

Cricket Photos: ఈ దిగ్గజ ఆటగాడు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరేవాడు.. ఈ రోజు ఆయన పుట్టినరోజు..

Salmonellosis: అమెరికా, యూరప్‌లో విస్తరిస్తున్న సాల్మోనెలోసిస్.. జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు..!