SIM Cards: మీ ఆధార్‌తో ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో తెలుసుకోండి ఇలా..!

| Edited By: Ravi Kiran

Jan 24, 2022 | 6:50 AM

SIM Cards: భారతీయులకు ఆధార్‌ కార్డు (Aadhaar) అనేది ఎంతో ముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి ఆధార్‌ లేనిది పనులు చేసుకోలేని పరిస్థితి...

SIM Cards: మీ ఆధార్‌తో ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో తెలుసుకోండి ఇలా..!
Follow us on

SIM Cards: భారతీయులకు ఆధార్‌ కార్డు (Aadhaar) అనేది ఎంతో ముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి ఆధార్‌ లేనిది పనులు చేసుకోలేని పరిస్థితి. ఇక ఆధార్‌ నంబర్‌ (Aadhaar Number)తో అన్ని వివరాలు తెలిసిపోతాయి. బ్యాంకు అకౌంట్ (Bank Account) నుంచి చిన్న చిన్న పనులకు ఆధార్‌ తప్పనిసరి. ఆధార్‌ అవసరం ఎంత పెరిగిందో.. దుర్వినియోగం కూడా అంతే పెరిగింది. నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు.

ఆధార్‌ దుర్వినియోగంపై కొత్త వెబ్‌సైట్‌:

ఆధార్‌తో లింకైన సిమ్‌ కార్డుల దుర్వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని టెలికాం శాఖ ఇటీవల టూల్‌ అనలటిక్స్‌ ఫర్‌ ఫ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ (TAFCOP)ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్‌లైన్‌ టూల్‌, పోర్టల్‌తో యూజర్లు ఆధార్‌ నెంబర్‌తో లింకైన మొబైల్‌ నెంబర్లను అన్నింటిని తెలుసుకునే వెసులుబాటు ఉంది.

ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీ ఆధార్‌ కార్డు పై ఇప్పటి వరరకకు ఎన్ని సిమ్‌ కార్డులను ఉపయోగించారో తెలుసుకోవచ్చు. ఇక మీకు తెలియకుండా మీ ఆధార్‌ నెంబర్‌తో ఏదైనా ఫోన్‌ నెంబర్‌ లింకైనట్లు తేలినట్లయితే మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీ ఆధార్‌ కార్డుపై ఎన్ని సిమ్‌ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీని వల్ల మీరు మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. మీరు https://tafcop.dgtelecom.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఫోన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ (OTP)ని ఎంటర్‌ చేస్తే మీ పేరుపై ఉన్న మొబైల్‌ నెంబర్లు కనిపిస్తాయి. వాటిని బ్లాక్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Twitter Video Download: మీ స్మార్ట్‌ఫోన్‌లలో ట్విట్టర్‌ వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..!

Whatsapp: మీ మొబైల్‌లో ఫోన్‌ నంబర్‌ సేవ్‌ చేయకుండానే వాట్సాప్‌ మెసేజ్‌ పంపవచ్చు.. ఎలాగంటే..!