Facebook Password: మీ ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేయకుండా కాపాడుకోవాలనుకుంటే ఇలా పాస్‌వర్డ్‌ని మార్చండి..!

Facebook Password: ప్రస్తుతం సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. నేరగాళ్లు సోషల్‌ మీడియా అకౌంట్లను టార్గెట్‌ చేసుకుని వ్యక్తిగత వివరాలను తెలుసుకుంటున్నారు. సోషల్‌ మీడియా..

Facebook Password: మీ ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేయకుండా కాపాడుకోవాలనుకుంటే ఇలా పాస్‌వర్డ్‌ని మార్చండి..!
Follow us
Subhash Goud

|

Updated on: May 10, 2022 | 7:53 AM

Facebook Password: ప్రస్తుతం సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. నేరగాళ్లు సోషల్‌ మీడియా అకౌంట్లను టార్గెట్‌ చేసుకుని వ్యక్తిగత వివరాలను తెలుసుకుంటున్నారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ఫేస్‌బుక్‌ (Facebook). దీనిని చాలా మంది వినియోగిస్తుంటారు. ఇక ఫేస్‌బుక్‌లో పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. అది కూడా సులభమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోకుండా స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకోవాలి. అందుకే మీ Facebook ఖాతా సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యం. అయితే మీ ఫేస్‌బుక్ పాస్‌వర్డ్ ఎవ్వరు కూడా గుర్తించని విధంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఇక చాలా మంది తరచుగా తమ ఫేస్‌బుక్ పాస్‌వర్డ్‌ను కూడా మరచిపోతారు. Facebook పాస్‌వర్డ్‌ను మార్చాలంటే ఈ మార్గాలను అనుసరించండి.

కంప్యూటర్‌లో ఫేస్‌బుక్‌ పాస్‌వర్డ్‌ను ఎలా మార్చాలి?

☛ కంప్యూటర్‌లో లేదా ల్యాప్‌టాప్‌లో Facebook ఖాతాను లాగిన్‌ అవ్వండి.

ఇవి కూడా చదవండి

☛ లాగిన్‌ అయిన తర్వాత ఎగువ కుడి భాగంలో ఉన్న డ్రాప్‌డౌన్‌ ట్యాబ్ గుర్తుపై క్లిక్‌ చేయండి.

☛ Security and login లోకి వెళ్లాలి. అక్కడ Change passwordను ఉంచుకోవాలి.

☛ తర్వాత అక్కడ మీ పాస్‌వర్డ్‌ను మార్చండి.

☛ ఇక్కడ పాత పాస్‌వర్డ్‌ను టైప్‌ చేసి అపై కొత్త పాస్‌వర్డ్‌ను రెండు సార్లు నమోదు చేయండి

☛ కొత్త పాస్‌వర్డ్‌ను నమోదు చేసిన తర్వాత సేవ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.

Android యాప్‌లో Facebook పాస్‌వర్డ్‌ని మార్చడానికి..

☛ Facebook యాప్‌ని తెరిచి, కుడి ఎగువ మూలలో ఉన్న మూడు-లైన్ల మెను గుర్తుపై నొక్కండి.

☛  Security and login ట్యాప్‌పై క్లిక్‌ చేయాలి.

☛ ఆ తర్వాత Change passwordని ఎంచుకుని ఆపై పాస్‌వర్డ్‌ను మార్చండి.

☛ ఇప్పుడు మీ ప్రస్తుతం పాస్‌వర్డ్‌ను నమోదు చేసి తర్వాత రెండు సార్లు కొత్త పాస్‌వర్డ్‌ను నమోదు చేసి సేవ్‌ చేయండి.

ఇక ఐఫోన్‌లో ఫేస్‌బుక్‌ పాస్‌వర్డ్‌ మార్చాలంటే దాదాపు ఇదే ప్రాసెస్‌ ఉంటుంది. పాస్‌వర్డ్‌ను మార్చేటప్పుడు ఎప్పుడు కూడా స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాలి. సులభమైన Facebook పాస్‌వర్డ్ కారణంగా ఎవరైనా మీ Facebook ఖాతాను హ్యాక్‌ చేసే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..