Whatsapp: చాట్స్‌, డేటా కోల్పోకుండా వాట్సాప్‌ నెంబర్‌ను మార్చుకోవాలా.? ఈ సింపుల్ ట్రిక్‌ ఫాలో అయితే సరి..

|

Oct 25, 2022 | 8:13 PM

ప్రతీ ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్‌ ప్రధానమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తుంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్‌ ఉంది...

Whatsapp: చాట్స్‌, డేటా కోల్పోకుండా వాట్సాప్‌ నెంబర్‌ను మార్చుకోవాలా.? ఈ సింపుల్ ట్రిక్‌ ఫాలో అయితే సరి..
Whatsapp Number Change
Follow us on

ప్రతీ ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్‌ ప్రధానమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తుంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్‌ ఉంది. ఇక వాట్సాప్‌ను ఉపయోగించే క్రమంలో కొన్ని సందర్భాల్లో అప్పటి వరకు ఉపయోగిస్తున్న నెంబర్‌ను మార్చుకోవాలనుంటారు.? కానీ నెంబర్‌ మార్చితే అప్పటి వరకు ఉన్న చాట్స్‌, పాత డేటా అంతా తొలగిపోతుంది. మరి అలా కాకుండా డేటా, చాట్స్‌ కోల్పోకుండా ఉండే అవకాశం లేదా.? అంటే కచ్చితంగా ఉంది. ఇందుకోసం కొన్ని సింపుల్‌ ట్రిక్‌ ఫాలో అయితే సరి.

* ముందుగా వాట్సాప్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

* అనంతరం సెట్టింగ్‌ ఆప్షన్స్‌లోకి వెళ్లాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం అకౌంట్‌ సెట్టింగ్ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

* తర్వాత చేంజ్‌ నెంబర్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* అనంతరం నెక్ట్స్‌ ఆప్షన్‌ టు ప్రోసీడ్‌ ఫర్దర్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

* తర్వాత ఓపెన్‌ అయి కాలమ్‌లో ప్రస్తుతం ఉన్న వాట్సాప్‌ రిజిస్టర్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి.

* తర్వాత మీరు మారాలనుకుంటున్న నెంబర్‌ను ఎంటర్‌ చసి నెక్ట్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* ఇలా నెంబర్‌ను మార్చుకున్న విషయాన్ని మీ కాంటాక్ట్స్‌, చాట్స్‌తో పాటు, ఎంపిక చేసుకున్న నెంబర్స్‌కి తెలియజేసే ఆప్షన్‌ను కూడా వాట్సాప్‌ అందించింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..