Sunita Williams: సునీత విలియమ్స్ జీతం ఎంతో తెలుసా? అంతరిక్షంలో ఉన్నందుకు అదనంగా ఎంత?
Sunita Williams: ఎనిమిది రోజులపాటు కొనసాగాల్సిన మిషన్‌లో పాల్గొన్నా ఈ ఇద్దరూ సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిది నెలలకు పైగా స్పేస్ స్టేషన్‌లోనే గడపాల్సి వచ్చింది. మరి ఇంతకాలానికి వారికి అదనంగా ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఈ ఇద్దరు ఎంత వేతనం అందుకున్నారనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి..

అంతరిక్షంలో చిక్కుపోయిన భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌ను భూమి పైకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు నాసా-స్పేస్ ఎక్స్‌లు సంయుక్తంగా క్రూ-10 మిషన్‌ను చేపట్టాయి. నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్-9 రాకెట్.. మార్చి 15 శనివారం కెనడీ స్పేస్‌సెంటర్ నుంచి నింగిలోకి తీసుకెళ్లింది. వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో కూడా అనుసంధానం కాగా.. వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. వారికి సునీత, బుచ్ విల్మోర్ బృందం స్వాగతం పలికింది. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఈ అయితే.. మార్చి 19న విలియమ్స్ అంతరిక్షం నుంచి బయలుదేరనున్నట్లు ముందుగా నాసా ప్రకటించగా, ఆ షెడ్యూల్ ను నాసా ఒక రోజు ముందుకు మార్చింది. దీంతో 18న సునీతా విలియమ్స్, విల్మోర్ భూమిపైకి రానున్నారు.
ఎనిమిది రోజులపాటు కొనసాగాల్సిన మిషన్‌లో పాల్గొన్నా ఈ ఇద్దరూ సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిది నెలలకు పైగా స్పేస్ స్టేషన్‌లోనే గడపాల్సి వచ్చింది. మరి ఇంతకాలానికి వారికి అదనంగా ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఈ ఇద్దరు ఎంత వేతనం అందుకున్నారనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. నాసా వ్యోమగాములు కూడా సాధారణ ప్రభుత్వ ఉద్యోగులే. వారి వేతనం ఫిక్స్‌డ్‌గానే ఉంటుంది. అదనపు గంటలు పనిచేసినా ఎలాంటి అదనపు వేతనం ఉండదు. మాజీ నాసా వ్యోమగామి కెడి కొల్మన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతరిక్ష ప్రయాణం కూడా సాధారణ పనిలో భాగమే.
వేతనం ఎంత?
ఇక ఐఎస్ఎస్‌లో ఉన్న సమయంలో వ్యోమగాముల ఆహారం ఖర్చులను నాసానే భరిస్తుంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు జీఎస్ 15 ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో ఉన్నారు. ఈజీఎస్ 15 జాబితాలోని ఉద్యోగులు అమెరికాలోనే అత్యధిక జీతం అందుకుంటున్న జాబితాలో వీరున్నారు. వీరి బేసిక్ సాలరీ 1,25,133 డాలర్ల నుంచి 1,62,672 డాలర్ల (భారత కరెన్సీలో రూ. 1.08 కోట్ల నుంచి రూ. 1.41కోట్ల మధ్య) ఉంటుంది. అయితే ఈ ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకుపోయారని నాసా చెప్పడం లేదు. 9 నెలలు గడుస్తున్నా వారు ఐఎస్ఎస్ లోనే సాధారణంగా విధులు నిర్వహిస్తున్నారంటూ స్పష్టం చేస్తోంది.
అంతరిక్షంలోకి వెళ్లినా ఇదే స్థాయిలో జీతం:
అయితే వీరు అంతరిక్షంలోకి వెళ్లినా కూడా ఇదే స్థాయిలో జీతాన్ని చెల్లిస్తారట. ఉద్యోగ పనుల నిమిత్తమే వారు అక్కడకు వెళ్లారు కాబట్టి.. భూమ్మీద ఇచ్చినంతే ఇస్తారు. అంతరిక్షంలో నిర్దేశిత సమయం కంటే ఎక్కువ రోజులు పని చేసినప్పటికీ ఈ వ్యోమగాములకు ఎలాంటి అదనపు చెల్లింపులు ఉండవని నాసా విశ్రాంత వ్యోమగామి క్యాడీ కోల్‌మన్ తెలిపారు. సాధారణంగా వచ్చే జీతంతో పాటు అంతరిక్షంలో ఆహారం, బస ఖర్చులను నాసాయే భరిస్తుందని వివరించారు. ఇలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం కాస్త ఎక్కువ డబ్బులు ఇస్తారని అన్నారు. అది కూడా చాలా తక్కువ అని.. ముఖ్యంగా రోజుకు 4 డాలర్లు మాత్రమే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. తాను 2010-11 మిషన్‌లో భాగంగా 159 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్నానని.. అందుకు తనకు సాధారణంగా వచ్చే జీతం కంటే 636 డాలర్లు ( భారత కరెన్సీ ప్రకారం రూ.348) అధికంగా చెల్లించినట్లు చెప్పారు. ఈ లెక్కన సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లకు గాను తొమ్మిది నెలలకు 1100 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.లక్ష) మాత్రమే అదనంగా పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి