Honor Pad X8a: చిన్నారుల కోసం ప్రత్యేకంగా.. హానర్‌ పాడ్‌ కిడ్స్‌ ఎడిషన్‌, సూపర్ ఫీచర్స్‌..

|

Oct 06, 2024 | 2:51 PM

చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫీచర్లతో ఈ హానర్‌ ప్యాడ్ ఎక్స్‌8ఏ ట్యాబ్‌ను తీసుకొచ్చారు. డ్యూరబుల్, షాక్‌ ప్రూఫ్‌ బాడీ, చైల్డ్ సేఫ్‌తో పాటు ట్యాబ్‌కు రక్షణ కోసం సిలికాన్‌ కేస్‌ను అందించారు. ఇక చిన్నారుల కళ్‌లపై ఎలాంటి ప్రభావం పడకుండా ఇందులో 'ఐ కంఫర్ట్‌ మోడ్‌' వంటి అధునాతన ఫీచర్‌ను అందించారు. అలాగే పేరెంట్స్‌ ట్యాబ్‌ను కంట్రోల్‌ చేసే విధంగా...

Honor Pad X8a: చిన్నారుల కోసం ప్రత్యేకంగా.. హానర్‌ పాడ్‌ కిడ్స్‌ ఎడిషన్‌, సూపర్ ఫీచర్స్‌..
Honor Pad X8a
Follow us on

ప్రస్తుతం ట్యాబ్స్ వినియోగం భారీగా పెరిగింది. చిన్నారులు కూడా ట్యాబ్స్‌ ఉపయోగిస్తున్నారు. స్కూల్‌ వర్క్‌ కూడా ట్యాబ్స్‌లో చేసుకునే రోజులు వచ్చేశాయ్‌. లెర్నింగ్ ఫీచర్స్‌తో కూడిన ట్యాబ్స్‌కు మార్కెట్లో భలే డిమాండ్‌ ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ హానర్‌ మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేసింది. హానర్‌ ప్యాడ్ ఎక్స్‌8ఏ కిడ్స్‌ ఎడిషన్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫీచర్లతో ఈ హానర్‌ ప్యాడ్ ఎక్స్‌8ఏ ట్యాబ్‌ను తీసుకొచ్చారు. డ్యూరబుల్, షాక్‌ ప్రూఫ్‌ బాడీ, చైల్డ్ సేఫ్‌తో పాటు ట్యాబ్‌కు రక్షణ కోసం సిలికాన్‌ కేస్‌ను అందించారు. ఇక చిన్నారుల కళ్‌లపై ఎలాంటి ప్రభావం పడకుండా ఇందులో ‘ఐ కంఫర్ట్‌ మోడ్‌’ వంటి అధునాతన ఫీచర్‌ను అందించారు. అలాగే పేరెంట్స్‌ ట్యాబ్‌ను కంట్రోల్‌ చేసే విధంగా పేరెంటల్‌ కట్రోల్‌ టూల్స్‌ను అందించారు. దీంతో పెద్దలు తమ చిన్నారుల చేతుల్లోని ట్యాబ్స్‌ను కంట్రోల్ చేయొచ్చు.

ఇక ట్యాబ్ బరువు 495 గ్రాములు కాగా 7.25 ఎమ్‌.ఎమ్‌ స్లిమ్‌ బాడీతో డిజైన్‌ చేశారు. ఇందులో 11 ఇంచెస్‌తో కూడిన 90 హెచ్‌జెడ్‌ ఐ కంఫర్ట్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇక ఈ ట్యాబ్‌లో క్వాడ్‌ సరౌండ్ స్పీకర్స్‌ను ఇచ్చారు. హానర్‌ ప్యాడ్‌ ఎక్స్‌8ఏ ట్యాబ్‌ స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 14 గంటల వీడియో ప్లే బ్యాకప్‌ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ట్యాబ్‌ను 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఈ ట్యాబ్‌ పనిచేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 5 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఇందులో 8300 ఎమ్‌ఏహెచ్‌ వంటి పవర్‌ ఫుల్ బ్యాటరీని అందించారు. ఈ ట్యాబ్‌ బేస్‌ వేరియంట్‌ ధర రూ. 10,999గా నిర్ణయించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..