Hero Xoom Scooter: యాక్టివాకు పోటీగా హీరో గ్జూమ్ స్కూటర్.. తక్కువ ధరకే పొందండిలా..!
హీరో గ్జూమ్ పేరుతో లాంచ్ చేసిన ఈ స్కూటర్ హోండా యాక్టివాకు గట్టి పోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు చెబతున్నాయి.
ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో ఇటీవల తన సొంత స్కూటర్ ను లాంచ్ చేసింది. హీరో గ్జూమ్ పేరుతో లాంచ్ చేసిన ఈ స్కూటర్ హోండా యాక్టివాకు గట్టి పోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు చెబతున్నాయి. ఎందుకంటే యాక్టివా కంటే ప్రీమియం ఫీచర్స్ ఈ స్కూటర్ లో అందుబాటులో ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన ఆటో ఎక్స్ పో 2023 లో కంపెనీ ఈ స్కూటర్ ను ప్రదర్శనకు పెట్టింది. ఈ స్కూటర్ బుక్సింగ్ కూడా ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే తక్కువ ధరలో ఈఎంఐ మీద స్కూటర్ కొనాలనుకునే వారికి గ్జూమ్ స్కూటర్ ఓ మంచి ఆప్షన్ గా నిలుస్తుంది. అసలు స్కూటర్ ధర ఎంత ఏ మోడ్స్ లో వస్తున్నాయో తెలుసుకుందాం.
తక్కువ ధరకే పొందండిలా..
హీరో గ్జూమ్ స్కూటర్ మొత్తం మూడు వేరియంట్లల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఎల్ఎక్స్, వీఎక్స్, జెడ్ఎక్స్ వేరియంట్లు ఆకట్టకుంటున్నారు. అలాగే ఢిలీ ధరలకు అనుగుణంగా ఈ స్కూటర్ ఆన్ రైడ్ ప్రైస్ ఎల్ఎక్స్ రూ.80,091, వీఎక్స్ రూ.83,615, జెడ్ఎక్స్ రూ.85,019 గా ఉంది. ఈ స్కూటర్ ఎల్ ఎక్స్ ను కొనుగోలు చేయాలనుకుంటే 10 శాతం డౌన్ పేమెంట్ కట్టాక, మరో పది శాతం వడ్డీ కలుపుకుని నెలకు రూ.2326 చొప్పున మూడు సంవత్సరాల ఈఎంఐతో ఈ స్కూటర్ ను పొందవచ్చు. అదే వీఎక్స్ కూడా 10 శాతం డౌన్ పేమెంట్, 10 శాతం వడ్డీ వేసుకుంటే నెలకు రూ.2440 తో మూడు సంవత్సరాలు కడితే అప్పు తీరిపోతుంది. అయితే జెడ్ఎక్స్ తీసుకుంటే 9000 డౌన్ పేమెంట్ కట్టి, రూ.76,019 రుణానికి 10 శాతం వడ్డీతో కలిపి 36 నెలల కాలానికి నెలకు రూ.2453 చెల్లిస్తే స్కూటర్ మీ సొంతం అవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆన్ రోడ్ రేట్ రాష్ట్రం బట్టి మారుతూ ఉంటుంది. అలాగే ఈఎంఐ రేట్ కూడా కంపెనీ బట్టి మారుతూ ఉంటుంది.