నానాటికి వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. స్వచ్ఛమైన గాలి పీల్చడం కష్టమవుతోంది. బయట వాతావరణమే కాదు ఇళ్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. అంతా కాంక్రీట్ జంగిల్లా మారుతున్న నగరాల్లో పచ్చని చెట్టు కనిపించడం అరుదైపోతోంది. ఫలితంగా అనేక రకాల శ్వాస సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఊపరితిత్తులు కుదేలవుతున్నాయి. రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటోంది. ఇటువంటి పరిస్థితుల్లో కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లోనైనే స్వచ్ఛమైన గాలి పీల్చడం అవసరం. అందుకు ఎయిర్ ప్యూరిఫైయర్స్ మంచి ప్రత్యామ్నాయం. ఇవి మన ఇంట్లోని గాలిని ప్యూరిఫై చేసి, అత్యంత నాణ్యమైన గాలిని మనం పీల్చేందుకు సాయపడుతుంది. మార్కెట్లో చాలా రకాల ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి. అందులో జియోమీ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 ఒకటి. దీనిలో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. మంచి పనితీరు కనబరుస్తుంది. అసలు ఇది ఎలా పనిచేస్తుంది. దీనిలో ఉండే ఫీచర్లు ఏంటి? ధర ఎంత ఉంటుంది వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్మార్ట్ ఫోన్ల తయారీదారుగా పరిచయం అయిన జియోమీ మరిన్ని స్మార్ట్ ఉత్పత్తులను మన దేశంలో లాంచ్ చేస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే జియోమీ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4 ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 13,999గా ఉంది.
లుక్ అండ్ డిజైన్.. దీనిని వినియోగదారు సులభంగా వినియోగించుకునేలా దీని డిజైన్ ఉంటుంది. తెల్లటి పోల్కా-డాట్ లాంటి డిజైన్ కేవలం లుక్స్ కోసం మాత్రమే కాక.. చుట్టుపక్కల గాలిని లోపలికి తీసుకొని, తాజా స్వచ్ఛమైన గాలిని బయటకు పంపిస్తుంది. దీని మెరుగైన డిజైన్ ఎయిర్ ప్యూరిఫైయర్ 360 డిగ్రీల నుండి గాలిని తీసుకోవడానికి అనుమతిస్తుంది. అందువల్ల, ఫిల్టర్ ఏకరీతిగా ఉపయోగించబడుతుంది.
సర్వీస్ కూడా సులభం.. ఈ మోడల్ ఎయిర్ ప్యూరిఫైయర్ సర్వీస్ కూడా చాలా సులభంగా ఉంటుంది. ఒకే స్క్రూతో ఫ్యాన్ ను బయటకు తీయవచ్చు. లోపలి ప్రాంతాన్ని శుభ్రం చేయవచ్చు.
ఫీచర్లు.. దీనిలో మోనోక్రోమ్ ఓఎల్ఈడీ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ డిస్ ప్లేలో మూడు లైట్లు ఉంటాయి. రెడ్, ఆరెంజ్, గ్రీన్ కలర్లలో ఉంటాయి. మన ఇంట్లోని ఎయిర్ క్వాలిటీ అంటే గాలి నాణ్యతను ఇవి తెలియజేస్తాయి. గాలి నాణ్యత బాగా తక్కువగా ఉంటే రెడ్ లైట్, ఫర్వలేదు అనే స్థాయిలో ఉంటే ఆరెంజ్, నాణ్యమైన గాలి ఉంటే గ్రీన్ కలర్ లైట్లు వెలుగుతాయి. అలాగే ఇంట్లోని గాలిలో తేమ శాతాన్ని, ఉష్ణోగ్రతను కూడా చూపుతుంది. దీనిలోనే రియల్ టైం ఎయిర్ క్వాలిటీ ఇన్డెక్స్(ఏక్యూఐ) కూడా ఉంటుంది. ఇది ఇప్పటికప్పుడు గాలి నాణ్యతను అంచనావేస్తుంది.
చాలా స్మార్ట్.. దీని పేరులోనే ఉన్నట్లుగా ఈ ఎయిర్ స్మార్ట్ ప్యూరిఫైయర్ లో చాలా స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. వైఫై కనెక్ట్ చేసి ఫోన్ ద్వారా రిమోట్ ఆపరేషన్ చేయొచ్చు. అందుకోసం ఎంఐ హోమ్ యాప్ ను మీ స్మార్ట్ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నగరాల్లో ముఖ్యంగా గాలి నాణ్యత తక్కువగా ఉండే ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రాంతాల్లో దీనిని విరివిగా వినియోగిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..