WhatsApp New Feature: ఒకే వాట్సాప్.. నాలుగు డివైజ్‪లు.. నలుగురు వ్యక్తులు.. వివరాలు తెలుసుకోండి..

|

Mar 25, 2023 | 6:40 PM

అర్జెంట్ గా వాట్సాప్ లో మెసేజ్ పంపాలి.. మీ ఫోన్ లో బ్యాటరీ చార్జింగ్ అయిపోయి స్విచ్ఛాఫ్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? ఈ సమస్యకు చెక్ పెడుతూ విండోస్ డెస్క్ టాప్ కోసం సరికొత్త వాట్సాప్ యాప్ తీసుకొచ్చింది. దీని ద్వారా ఒకేసారి నాలుగు డివైజ్ లలో మీరు వాట్సాప్ వినియోగించవచ్చు.

WhatsApp New Feature: ఒకే వాట్సాప్.. నాలుగు డివైజ్‪లు.. నలుగురు వ్యక్తులు.. వివరాలు తెలుసుకోండి..
Whatsapp
Follow us on

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ తెలుసు. అసలు వాట్సాప్ లేని స్మార్ట్ ఫోనే ఉండదేమో! అంతలా జనాలకు కనెక్ట్ అయిపోయింది. సమాచార మార్పిడికి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం మంది వినియోగిస్తున్న ప్లాట్ ఫామ్ వాట్సాప్. మెటా యాజమన్యాంలో నడిచే ఈ యాప్.. వినియోగదారుల అవసరాలను గుర్తించి, ఎప్పటికప్పుడు సరికొత్త అప్ డేట్ లు తీసుకొస్తుంది. యూజర్లకు సానుకూల అనుభవాన్ని పంచడంలో ఎప్పుడూ ఒక అడుగు ముందుకే ఉంటుంది. అదే క్రమంలో మరో సరికొత్త అప్ డేట్ ను అందించింది. ఇప్పటి వరకూ వాట్సాప్ ఒక ఫోన్ నంబర్ పై ఒక డివైజ్ లో మాత్రమే పనిచేసేది. డెస్క్ టాప్ లో పనిచేయాలంటే మాత్రం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి వచ్చేది. అయితే ఫోన్ మాత్రం ఆన్ లో ఉంటేనే ఈ డెస్క్ టాప్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు దీనిని వినియోగదారులకు మరింత అనువుగా మార్చింది. సరికొత్త డెస్క్ టాప్ వాట్సాప్ వెర్షన్ ను ఆవిష్కరించింది. దీని ద్వారా ఒకే నంబర్ పై నాలుగు డివైజ్ లలో వాట్సాప్ ను వినియోగించుకోవచ్చు. అదెలాగో చూద్దాం..

అర్జెంట్ గా వాట్సాప్ లో మెసేజ్ పంపాలి.. మీ ఫోన్ లో బ్యాటరీ చార్జింగ్ అయిపోయి స్విచ్ఛాఫ్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? ఈ సమస్యకు చెక్ పెడుతూ విండోస్ డెస్క్ టాప్ కోసం సరికొత్త వాట్సాప్ యాప్ తీసుకొచ్చింది. దీని ద్వారా ఒకేసారి నాలుగు డివైజ్ లలో మీరు వాట్సాప్ వినియోగించవచ్చు. మీ వాట్సాప్ ను నాలుగు డివైజ్లకు లింక్ చేసుకోవచ్చు. అవన్నీ సింక్రనైజ్ అవుతాయి. అలాగే ఎన్ క్రిప్టెడ్ అయి ఉంటాయి. ఒక వేళ మీ ఫోన్ స్విచ్ఛాఫ్ అయినా మిగిలిన డివైజ్లలో వాట్సాప్ పనిచస్తుంది. దీని కోసం మీరు మీ డెస్క్ టాప్ లోని వాట్సాప్ ని అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాక ఈ కొత్త అప్ డేట్ లో డెస్క్ టాప్ ద్వారా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కూడా చేసుకొనే వెసులుబాటును వాట్సాప్ కల్పించింది.

నో చార్జర్.. నో ప్రాబ్లమ్..

దీనిపై వాట్సాప్ అధికారికంగా ట్వీచ్ చేసింది. ఇకపై చార్జర్ అవసరం లేదు. ఎలాంటి సమస్య లేదు, ఒక వేళ మీ ఫోన్ ఆఫ్ లైన్ లోకి వెళ్లినప్పటికీ, మిగిలిన డివైజ్ లలో వాట్సాప్ వాడుకోవచ్చు అంటూ ఆ ట్వీట్ లో వివరించింది. ఒకేసారి నాలుగు డివైజ్ లలో లాగిన్ అయ్యేందుకు వాట్సాప్ సరికొత్త విండోస్ యాప్ ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ఎలా లింక్ చేయాలంటే..

  • మీ ఫోన్ నంబర్ కు లింక్ అయి ఉన్న వాట్సాప్ ను ప్రైమరీ డివైజ్ లో ఓపెన్ చేయండి.
  • సెట్టింగ్స్ లోకి వెళ్లి లింక్డ్ డివైజెస్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.
  • ఆ తర్వాత లింక్ ఏ న్యూ డివైజ్ పై క్లిక్ చేసి, దానిలో సూచిస్తున్న విధంగా చేయండి.
  • రెండో డివైజ్ ను కనెక్ట్ చేయాలనుకొంటే, ఉదాహరణకు విండోస్ డెస్క్ టాప్ అనుకొంటే, వాట్సాప్ వెబ్ ను గూగుల్ లో టైప్ చేసి, దానిని క్లిక్ చేయాలి.
  • వెబ్ పేజీలో వచ్చిన క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేయాలి.
  • అది చాట్స్ ని సింక్రనైజ్ చేయడానికి కొంత సమయాన్ని తీసుకుంటుంది. తర్వాత చాట్స్ ఓపెన్ అవుతాయి.
  • ఇదే విధానాన్ని ఉపయోగించి మీరు వేరే డివైజ్ లకు కూడా వాట్సాప్ ను కనెక్ట్ చేయవచ్చు. ఇలా నాలుగు డివైజ్ లవరకూ కనెక్ట్ చేయొచ్చు.
  • అలాగే మీకు అవసరం లేనప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ లింక్ చేసుకోవచ్చు.
  • ఈ నాలుగు డివైజ్ లను ఒకేసారి వినియోగించవచ్చు.

దీని కోసం మీ ప్రైమరీ ఫోన్ ఆన్ లో ఉండాల్సిన అవసరం లేదు. వాట్సాప్ లింక్ అయ్యేంత వరకూ ఆన్ లో ఉంటే సరిపోతుంది. ఇలా 14 రోజుల వరకూ వాట్సాప్ ని లాగ్ అవుట్ చేయకుండా వినియోగించుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..