ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే వాయిస్ నోట్, తేదీతో చాట్ సెర్చ్, పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ వంటి అత్యాధునిక ఫీచర్లను అందించింది. ఇప్పుడు మరింత అడ్వాన్స్ డ్ ఫీచర్లను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకు సంబంధించిన పరీక్షలు కూడా వేగంగా నిర్వహిస్తోంది. త్వరలో టెక్ట్స్ ఎడిటర్ పేరుతో వాట్సాప్ ఓ సరికొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది. దీనిలో ఫొటోలు, వీడియోలు, గిఫ్ లను ఎడిట్ చేయడానికి వీలుంటుంది. ఈటెక్ట్స్ ఎడిటర్ మూడు ఆప్షన్లు ఉంటాయి. వీటితో యూజర్లు టెక్ట్స్ బ్యాక్ గ్రౌండ్, ఫాంట్ చేంజ్, టెక్ట్స్ అలైన్మెంట్ వంటివి చేయొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
వాట్సాప్ బీటా ఇన్ ఫో రిపోర్టు ప్రకారం.. టెక్ట్స్ ఎడిటర్ లోని ఫాంట్ చేంజ్ ఆప్షన్ తో, యూజర్ కీబోర్డులో తనకు నచ్చిన ఫాంట్ ను ఎంచుకుని టెక్ట్స్ లో మార్పులు చేయొచ్చు. ఫొటో, వీడియో, గిఫ్ లపై టెక్ట్స్ రాసేటప్పుడు ఈ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
అలాగే మార్చిలో ప్రచురితమైన కొన్ని రిపోర్టుల ప్రకారం వాట్సాప్ ఆడియో చాట్స్ అనే కొత్త ఫీచర్ ను కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అలాగే యూజర్లు వాట్సాప్ పంపే ఫొటోలను ఒరిజనల్ సైజ్ లో పంపేలా కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీంతో యూజర్ వాట్సాప్ ద్వారా ఫొటోను ఇతరులకు షేర్ చేసినప్పుడు వాటి క్వాలిటీలో ఎలాంటి మార్పు ఉండదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..