Samsung Galaxy Z Fold5, Galaxy Flip 5
నెమ్మదిగా స్మార్ట్ ఫోన్ల ట్రెండ్ మళ్లీ ఫ్లిప్, ఫోల్డబుల్ మోడళ్ల వైపు మళ్లుతోంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేశాయి. ఈ విభాగంలో ప్రముఖ టెక్ కంపెనీ శామ్‌సంగ్ ఓ అడుగు ముందే ఉంది. ఇప్పటికే పలు రకాల ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసింది. ఇటీవల మోటోరోలా కూడా రెండు ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే శామ్ సంగ్ ఇప్పటికే ఉన్న పలు మోడళ్లకు కొనసాగింపుగా మరో రెండు ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొచ్చింది. శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 పేరిట వీటిని పరిచయం చేసింది. సియోల్ జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ వాచ్ 6 సిరీస్, గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరీస్‌లతో పాటు ఈ స్మార్ట్ ఫోన్లను శామ్‌సంగ్ విడుదల చేసింది. ఇవి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఫోన్లకు కొనసాగింపుగా వచ్చిన అప్‌డేటెడ్ వెర్షన్స్. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్‌ఓసీ ద్వారా శక్తిని పొందుతాయి. ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ శామ్ సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఫోన్లలో ప్రత్యేకతలు, ఫీచర్లు, రెండింటిలో తేడాలు ఓసారి చూద్దాం..
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 వర్సెస్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5..
ఈ రెండు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లలో కొన్ని సారూప్యాలున్నాయి. మరికొన్ని తేడాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ల ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లను గమనిద్దాం రండి..
రెండింటి ధర ఇలా..
- గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ధర విషయానికి వస్తే.. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,54,999 కాగా 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,64,999, అదే 12 జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ వేరింయట్ ధర రూ. 1,84,999గా ఉంది.
- గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ధరలు పరిశీలిస్తే.. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.రూ. 99,999, 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,09,999గా ఉంది.
- గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 బుక్-స్టైల్ ఫోల్డబుల్ క్రీమ్, ఐసీ బ్లూ, ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది, అయితే స్మార్ట్‌ఫోన్ బ్లూ, గ్రే కలర్‌వేలు కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 బ్లూ, క్రీమ్, గ్రాఫైట్, గ్రే, గ్రీన్, లావెండర్, మింట్, ఎల్లో షేడ్స్‌లో లభిస్తోంది.
స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు..
- గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ఫోల్డబుల్ ఫోన్ 7.6-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ ప్యానెల్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అదే విధంగా కవర్ స్క్రీన్ 6.2-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ 2X డిస్ ప్లే ఉంఉటంది. అదే సమయంలో, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్, డైనమిక్ అమోల్డ్ 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ మెయిన్ డిస్‌ప్లే, బయట స్క్రీన్ 3.4-అంగుళాల సూపర్ అమోల్డ్ ఫోల్డర్-వ్యూ కలిగి ఉంది.
- ఫోన్‌లు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్‌ఓసీ ద్వారా శక్తిని పొందుతాయి. బుక్-స్టైల్ ఫోల్డబుల్ 12జీబీ ర్యామ్‌తో 1టీబీ వరకు అంతర్నిర్మిత నిల్వతో వస్తుంది. క్లామ్‌షెల్ ఫోల్డబుల్ 8జీబీ ర్యామ్ మరియు 512జీబీ వరకు నిల్వను కలిగి ఉంది. రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 13-ఆధారిత వన్‌యూఐ 5.1.1తో రన్ అవుతాయి.
- గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ఫోన్లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 12-మెగాపిక్సెల్ సెన్సార్, టెలిఫోటో లెన్స్‌తో కూడిన 10-మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తుంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5లోవెనుకవైపు రెండు 12-మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ఫోన్‌లు ఒక్కొక్కటి 10-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటాయి. ఫోల్డ్ 5 అదనంగా 4-మెగాపిక్సెల్ అండర్ డిస్‌ప్లే కెమెరాను కూడా పొందుతుంది.
- 4,400mAh బ్యాటరీతో కూడిన, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 25వాట్ల వైర్డు ఫాస్ట్ చార్జింగ్, ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0, వైర్‌లెస్ పవర్‌షేర్‌కు మద్దతు ఇస్తుంది. అదే సమయంలో, ఫ్లిప్ 5 ఇదే విధమైన ఛార్జింగ్ మద్దతుతో 3,700ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. రెండు హ్యాండ్‌సెట్‌లు 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్ సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..