స్మార్ట్ ఫోన్లు విస్తృతమవడంతో ప్రపంచ ముఖ చిత్రం మారిపోయింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ ఫోన్లు ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చాయి. ప్రస్తుతం వస్తున్న మోడరన్ స్మార్ట్ ఫోన్లలో చాలా వరకూ హై రిజల్యూషన్ కెమెరాలతో వస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అందరూ సెల్ఫీలకు అధిక ప్రధాన్యం ఇస్తున్నారు. అలాగే వీడియో కాల్స్, షార్ట్స్ వంటివి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు అధిక సామర్థ్యం కలిగిన కెమెరాలను అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులు తమ అమూల్యమైన క్షణాలను అందులో బంధించి భద్రపరుచుకుంటున్నారు. అయితే దీంతో ఓ సమస్య ఏర్పడుతోంది. కెమెరా సెన్సార్స్, రిజల్యూషన్ ఎంత పెరిగితే అంత ఎక్కువ సైజ్ లో ఫొటో గానీ, వీడియో గానీ స్టోర్ అవుతుంది. దీనివల్ల ఫోన్ లో స్టోరేజ్ సమస్య వస్తుంది. ఫోన్ స్టోరేజీ త్వరగా అయిపోయే అవకాశం ఉంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అధిక సైజ్ ఉండే ఫొటోలు, వీడియోల కారణంగా ఫొన్ స్టోరేజ్ కాపాడుకోవడం ఎలా? దాని కోసమే ఉంది ఓ బెస్ట్ ఆప్షన్. అదే గూగుల్ ఫోటోస్. ఈ యాప్ ద్వారా మీ ఫోన్ లోని ఫోటోలు, వీడియోలు దానిలోకి పంపించి, మీ స్టోరేజ్ ని ఫ్రీ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
గూగుల్ ఫోటోస్ మీరు వినియోగించడానికి మీకు తప్పనిసరిగా గూగుల్ అకౌంట్ ఉండాలి. ఆ తర్వాత మీరు గూగుల్ ఫోటోస్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోకి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ ఫోన్ లోని ఫోటోలు గూగుల్ ఫోటోస్ లోకి పంపాలంటే మీకు తప్పనిసరిగా మంచి ఇంటర్ నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. స్టెప్ బై స్టెప్ విధానంలో మీ ఫోన్ స్టోరేజ్ ఎలా ఫ్రీ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
దీనిలో మీరు బ్యాక్ అప్ చేయాలనుకుంటున్న ఫోటోలు, వీడియోల క్వాలిటీని కూడా ఎంపిక చేసుకోవచ్చు. స్పేస్ ఎక్కువ వృథా కాకుండా కంప్రెస్ చేసి సేవ్ చేసుకొనే ఆప్షన్ కూడా ఉంది. అలాగే ఒరిజినల్ క్వాలిటీతో కూడా గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేస్తుంది. ఒక్కసారి మీరు ఫోటోలు, వీడియోలు బ్యాక్ అయిన తర్వాత మీరు ఫోన్ స్టోరేజ్ మొత్తాన్ని ఫ్రీ చేసుకోవచ్చు.
గూగుల్ ఫోటోస్ యాప్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి ఫ్రీ అప్ డివైజ్ స్టోరేజ్ పై క్లిక్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా బ్యాక్ అప్ అయిన ఫోటోలు వీడియోలో ఫోన్ స్టోరేజీ నుంచి డిలీట్ అవుతాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..