Smart phones under 10k: తక్కువ బడ్జెట్.. అదిరిపోయే ఫీచర్స్.. రూ. 10వేల లోపు బెస్ట్ ఫోన్లు ఇవే..

|

Mar 06, 2023 | 4:15 PM

మీరు ఒక వేళ తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ కథనం మీ కోసమే. కేవలం రూ. పదివేలు ధరలో టాప్ 5 మోడళ్లను మీకు పరిచయం చేస్తున్నాం. ఆ పూర్తి వివరాలు మీ కోసం..

Smart phones under 10k: తక్కువ బడ్జెట్.. అదిరిపోయే ఫీచర్స్.. రూ. 10వేల లోపు బెస్ట్ ఫోన్లు ఇవే..
Smartphones
Follow us on

ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అది లేనిదే రోజు కాదు కదా క్షణం కూడా గడువదు. ప్రతీది దానితో లింక్ అయిపోయింది. సమాచారానికి ఫోన్ కావాలి.. షాపింగ్ కి ఫోన్ కావాలి.. చాటింగ్ కి ఫోన్ కావాల్సిందే.. మరి అయితే ఎవరి అవసరాలను బట్టి వారు ఆ ఫోన్ కొనుగోలు చేస్తారు. కొందరు ఎక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ కొనుగోలు చేస్తారు. కొందరు తమకు అనువైన బడ్జెట్ లో తక్కువ ఫీచర్లున్న ఫోన్ వినియోగిస్తారు. మీరు ఒక వేళ తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ కథనం మీ కోసమే. కేవలం రూ. పదివేలు ధరలో టాప్ 5 మోడళ్లను మీకు పరిచయం చేస్తున్నాం. ఆ పూర్తి వివరాలు మీ కోసం..

రెడ్ మీ 10.. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో కేవలం రూ.9,999 ధరకు కి అందుబాటులో ఉంది. దీనిలో 6.7′ అంగుళాల హెచ్ డీ ప్లస్ ఎల్సీడీ డిస్‌ప్లే ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రోటెక్షన్ ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనిలో వెనుకవైపు 50ఎంపీ+2ఎంపీ కెమెరా ముందు వైపు 5ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇది 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 18వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు చేస్తుంది.

పోకో C55.. స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో కేవలం రూ.9,999 ధరకే అందుబాటులో ఉంది. ఇది మీడియా టెక్ హీలియో జీ85 చిప్‌సెట్‌తో 6.7 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుకవైపు 50ఎంపీ+వీజీఏ కెమెరా, ముందు వైపు 5ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఉంటుంది. ఇది 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 10W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తుంది.

ఇవి కూడా చదవండి

రెడ్ మీ A1ప్లస్.. ఇది రెడ్ మీ నుండి మరొక ఉత్తమ సరసమైన స్మార్ట్‌ఫోన్ పరికరం. ఇది కేవలం రూ.7,499 ధరకే కొనుగోలుకు అందుబాటులో ఉంది. పరికరం 6.52 అంగుళాల హెచ్ డీ ప్లస్ ఎల్ సీడీ డిస్ప్లే ఉంటుంది. ఇది మీడియా టెక్ హీలియో ఏ22 ద్వారా పనిచేస్తుంది. వెనుకవైపు 8ఎంపీ+వీజీఏ కెమెరా, ముందు వైపు 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది 10W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

మోటో E32.. ఈ స్మార్ట్ ఫోన్ రూ.9,499 ధర వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది 6.5 అంగుళాల హెచ్ డీ ప్లస్ ఎల్సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. మీడియా టెక్ హీలియో జీ37 చిప్‌సెట్ ప్రాసెసర్ ద్వారా ఇది పనిచేస్తుంది. కెమెరా ఫీచర్ విషయానికొస్తే, ఇది 50ఎంపీ+2ఎంపీ, 8ఎంపీ కెమెరాలను కలిగి ఉంది. మునుపటి స్మార్ట్‌ఫోన్ మోడల్ వలె, ఇది 10W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

లావా బ్లేజ్ 5G.. దీనిని ఆల్‌రౌండర్ అని పిలవవచ్చు. రూ.10,000 లలో లభించే బెస్ట్ ఫోన్ ఇదే. ఎందుకంటే మీకు సరసమైన ధరలో 5జీతో అనేక అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. దీని ధర 10,999. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5’అంగుళాల హెచ్ డీ ప్లస్ ఎల్ సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..