Electric Kettle: చలికాలంలో వేడివేడి డ్రింక్స్ తాగాలనుకుంటున్నారా..? అయితే మీకు ఉపకరించే టాప్ 4 ఎలక్ట్రిక్ కెటిల్స్ వివరాలిదిగో..

|

Dec 13, 2022 | 2:27 PM

శీతాకాలం వేడి వేడిగా నీరు, టీ, కాఫీ వంటి వాటిని తాగితే శరీరానికి చాలా హాయిగా అనిపిస్తుంది. మరి వాటిని తయారుచేయాలనుకునే వారికి గాస్ స్టౌవ్‌ల కొంత శ్రమ తప్పదు. కానీ ఆ అవసరం లేకుండా..

Electric Kettle: చలికాలంలో వేడివేడి డ్రింక్స్ తాగాలనుకుంటున్నారా..? అయితే మీకు ఉపకరించే టాప్ 4 ఎలక్ట్రిక్ కెటిల్స్ వివరాలిదిగో..
Kettle
Follow us on

శీతాకాలం వేడి వేడిగా నీరు, టీ, కాఫీ వంటి వాటిని తాగితే శరీరానికి చాలా హాయిగా అనిపిస్తుంది. మరి వాటిని తయారుచేయాలనుకునే వారికి గాస్ స్టౌవ్‌ల కొంత శ్రమ తప్పదు. కానీ ఆ అవసరం లేకుండా  అనుకున్నప్పుడల్లా.. టీ లేదా కాఫీ లేదా మరే ఇతర వేడి వేడి డ్రింక్ కోసమైనా ఎలక్ట్రిక్ కెటిల్స్ అందుబాటులోకి వచ్చాయి. మనం కావాలనుకుంటే వీటిని ఆన్‌లైన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. ఇవి ఉపయోగించడానికి చాలా సులభంగా ఉండడమే కాక అనేక విధాలుగా ఉపయోగపడతాయి. మరి ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాప్ 4 అత్యుత్తమ ఎలక్ట్రిక్ కెటిల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టాప్ 4 ఎలక్ట్రిక్ కెటిల్స్

కెంట్ వోగ్ ఎలక్ట్రిక్ కెటిల్:

ఈ కెటిల్ 1.8-లీటర్ సామర్థ్యం కలిగి ఉండడంతో ఒకే సారి ఐదు, ఆరు మందికి కావలసిన టీ, కాఫీలను తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీని కలిగి ఉండడమే కాక ఆటో-ఆఫ్ ఫీచర్‌తో వస్తుంది. ఈ కెటిల్ సాయంతో మీరు వేడినీటితో పాటు నిమిషాల్లోనే కాఫీ, టీ లేదా ఇన్‌స్టంట్ సూప్‌ని కూడా తయారు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

టెసోరా ప్రీమియం ఎలక్ట్రిక్ కెటిల్:

ఈ కెటిల్ ప్రీమియం ఆకృతితో పాటు మంచి నాణ్యతమైన స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన కూల్ టచ్ ఔటర్ బాడీని కలిగి ఉంది. దీనికి 1.8-లీటర్ సామర్థ్యం,  360-డిగ్రీ స్వివెల్ బేస్‌తో వస్తుంది.

స్టవ్‌క్రాఫ్ట్ అమేజ్ ప్లస్ ఎలక్ట్రిక్ కెటిల్:

ఈ కెటిల్ క్లాసిక్ మిర్రర్ పాలిష్ బాడీతో తయారుచేసి ఉంటుంది. వాడుకోవడానికి చాలా సౌకర్యవంతంగా.. 360° స్వివెల్ బేస్‌తో వస్తుంది.

హావెల్స్ ఆక్వా ప్లస్ డబుల్ వాల్ కెటిల్:

ఇది నో-ప్లాస్టిక్ ప్రోడక్ట్. పూర్తిగా స్టెయిన్‌లెస్ స్టీల్ కెటిల్. సులభంగా నింపడం, శుభ్రపరచడం కోసం విస్తృత ఆకారంలో ఇది వస్తుంది. కరెంట్‌ను ఆదా చేసేందుకు ఆటో-షట్ ఆఫ్ ఫంక్షన్‌తో కూడా వస్తుంది.