Best 2 TB External Hard Disks: మీ కంప్యూటర్ డేటా బ్యాకప్ చేయాలా? ఇవిగో బెస్ట్ 2 టీబీ ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్‪లు..

|

Feb 24, 2023 | 1:30 PM

ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ డ్రైవ్‌ను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు దాని సామర్థ్యం మీ డిమాండ్‌లకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. అలాగే వాటి నిర్మాణం కూడా ధృడంగా ఉండేటట్లు చూసుకోవాలి.

Best 2 TB External Hard Disks: మీ కంప్యూటర్ డేటా బ్యాకప్ చేయాలా? ఇవిగో బెస్ట్ 2 టీబీ ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్‪లు..
Hard Disk
Follow us on

ప్రస్తుత సమాజంలో అందరూ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ కలిగి ఉంటున్నారు. దానిని వినియోగిస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో దానిలోని స్టోరేజ్ అయిపోయి మీ సిస్టమ్ స్లో అయిపోయే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మీ కంప్యూటర్ స్టార్ట్ అవడానికి చాలా సమయం తీసుకుంటుంది. అలాగే పనితీరు విసిగిస్తుంటుంది. అలాంటి సమయంలో మీరు చేయాల్సిందల్లా మీ సిస్టమ్ మెమరీని రిలీజ్ చేయడమే. అంటే సిస్టమ్ లోని ఫైల్స్ ని బ్యాకప్ చేసుకొని సిస్టమ్ లో ఆ ఫైళ్లను డిలీట్ చేయాలి. అందుకు ఎక్స్ టర్నల్ డివైజ్ ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీనినే ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ అంటారు. దీనిలో గరిష్టంగా 2 టీబీ వరకూ స్టోరేజ్ సామర్థ్యాన్ని పొందవచ్చు.

కష్టమైన ఎంపిక..

కంప్యూటర్ ఉపకరణాలను కొనుగోలు చేసేటప్పుడు కాస్త ఆలోచించి కొనుగోలు చేయాలి. ఖరీదైనవన్నీ క్వాలిటీ తో ఉంటాయని అనుకుంటే పొరబాటు పడ్డట్టే. ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ డ్రైవ్‌ను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు దాని సామర్థ్యం మీ డిమాండ్‌లకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. అలాగే వాటి నిర్మాణం కూడా ధృఢంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే విధంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ నేపథ్యంలో మన దేశంలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

వెస్ట్రన్ డిజిటల్ పాస్‌పోర్ట్ ఎక్స్‌టర్నల్ హార్డ్ డ్రైవ్.. ఈ ఎక్స్‌టర్నల్ హార్డ్ డ్రైవ్ భారతీయ మార్కెట్లో అత్యుత్తమ 2TB హార్డ్ డిస్క్‌లలో ఒకటి. ఇది అద్భుతమైన భద్రత, రక్షణ అందిస్తుంది. దీనిలోని డేటాకు పాస్ వర్డ్ తో భద్రం చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ 256-బిట్ ఏఈఎస్ హార్డ్‌వేర్ ఎన్‌క్రిప్షన్‌తో, ఇది మీ అన్ని డిజిటల్ ఫైల్‌లను సురక్షితంగా ఉంచుతుంది. దీనిలో బ్యాకప్ సాఫ్ట్ వేర్ కూడా కలిగి ఉంది. చూడటానికి కూడా ఎర్గోనామిక్ డిజైన్ తో ఆకర్షణీయంగా ఉంటుంది. మన దేశ మార్కెట్లో దీని ధర రూ. 9,599 గా ఉంది.

ఇవి కూడా చదవండి

సీగేట్ బ్యాకప్ ప్లస్ స్లిమ్ 2 TB బాహ్య హెచ్ డీడీ.. మీ డేటా అత్యంత అమూల్యమైన ఆస్తి. ఈ సీగేట్ బ్యాకప్ ప్లస్ స్లిమ్ 2TB ఎక్స్‌టర్నల్ హెచ్ డీడీ అమెజాన్ బెస్ట్ సెల్లర్. 3 సంవత్సరాల రెస్క్యూ డేటా రికవరీ లైసెన్స్‌తో మీ విలువైన డేటా మొత్తాన్ని భద్రపరచగలదు. ఇది ఆన్-డిమాండ్ బ్యాకప్‌కు మద్దతు ఇస్తుంది. అంతేకాక ఇది గంటకు, రోజువారీ, వారానికి, నెలవారీ బ్యాకప్ లను ఆటోమేటిక్ గా అందిస్తుంది. దీనిలోని ప్లగ్-అండ్-ప్లే సాంకేతికత కారణంగా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ డేటాను బదిలీ చేయవచ్చు. ఈ సీగేట్ హార్డ్ డిస్క్ ధర మన దేశంలో రూ. 5,256 గా ఉంది.

అడాటా హెచ్డీ 710 ప్రో.. ఈ హార్డ్ డిస్క్ షాక్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్ వాటర్ రెసిస్టెంట్. దీనిని 60 నిమిషాల పాటు నీటిలో ఉంచేసినా ఇది యాథావిధి పనిచేస్తుందని ఆ కంపెనీ ప్రకటించింది. శక్తివంతమైన కోల్డ్-బ్లూ ఎల్ ఈడీ సూచనను కూడా కలిగి ఉంది. దీని ధర మన దేశంలో రూ. 7,243 గా ఉంది.

తోషిబా హెచ్ డీటీబీ420ఎక్స్ కే3 ఏఏ కాన్వియో.. ఈ తోషిబా కాన్వియో ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్ యూఎస్బీ 3.0, 2.0 రెండింటిని సపోర్ట్ చేస్తుంది. ప్లగ్-అండ్-ప్లే మెకానిజంను కలిగి ఉంది. దీనిలో కూడా ఎల్ ఈడీ సూచిక ఉంటుంది. చాలా సులభంగా డేటా బదిలీ చేయగలుగుతుంది. తోషిబా హార్డ్ డిస్క్ ధర రూ. 4,499 గా ఉంది.

ట్రాన్‌సెండ్ స్టోర్‌జెట్.. భారతదేశంలో అత్యుత్తమ 2 TB హార్డ్ డిస్క్‌ల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈ ట్రాన్‌సెండ్ స్టోర్‌జెట్ 2TB హార్డ్ డిస్క్ వాటిలో ఒకటిగా ఉంటుంది. అధునాతన మూడు-దశల షాక్ ప్రొటెక్షన్ మెకానిజం, వన్-టచ్ ఆటో-బ్యాకప్ బటన్ దీని ప్రత్యేకతలు. దీని ధర రూ. 6,999గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..