Whatsapp Shortcuts: వాట్సాప్‌ షార్ట్‌కట్స్‌ గురించి మీకు తెలుసా..? ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

|

Apr 16, 2023 | 7:28 PM

ప్రస్తుత కాలంలో వాట్సాప్‌ వినియోగించే వారి సంఖ్య పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ ఉండంది ఉండదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు వాట్సాప్‌ వినియోగం పెరిగిపోయింది. వినియోగదారుల కోసం వాట్సాప్‌ సంస్థ..

Whatsapp Shortcuts: వాట్సాప్‌ షార్ట్‌కట్స్‌ గురించి మీకు తెలుసా..? ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!
Whatsapp
Follow us on

ప్రస్తుత కాలంలో వాట్సాప్‌ వినియోగించే వారి సంఖ్య పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ ఉండంది ఉండదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు వాట్సాప్‌ వినియోగం పెరిగిపోయింది. వినియోగదారుల కోసం వాట్సాప్‌ సంస్థ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక ఉద్యోగులు, ఇతరులు కంప్యూటర్లలో ‘వెబ్‌ వాట్సాప్‌’ను ఓ భాగం చేసుకుంటున్నారు. వాట్సాప్‌ వెబ్ కోసం ప్రత్యేకంగా కొన్ని షార్ట్‌కట్‌లు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుంటే సులభంగా ఉంటుంది.

  1. మార్క్‌ యాజ్‌ అన్‌రీడ్‌: వాట్సాప్‌ గ్రూపుల్లో ఏదైనా మెసేజ్‌ వచ్చినప్పుడు ఓపెన్‌ చేసి చూస్తుంటాము. అప్పుడు పంపిన వ్యక్తికి మనం ఆ మెసేజ్‌ను చూసినట్లు తెలిసిపోతుంది. అలాకాకుండా మెసేజ్‌ను చూడకుండా ఉండేలా కూడా చేయవచ్చు. ctrl+alt+shift+u క్లిక్‌ చేస్తే అన్‌రీడ్‌ మోడ్‌లోకి మారిపోతుంది.
  2. పిన్‌ చాట్‌: సాధారణంగా ముఖ్యమైన వాట్సాప్‌ గ్రూపులు ఉంటే మనకు ఎప్పుడు ముందు కనిపించేలా పిన్‌ చాట్‌ చేస్తుంటాము. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని కోసం షార్ట్‌కట్‌లో ctrl+alt+shift+p క్లిక్‌ చేస్తే సరిపోతుంది.
  3. సెర్చ్‌ చాట్‌: వాట్సాప్‌ గ్రూపుల్లోని చాటింగ్‌ సెక్షన్‌లో సెర్చ్‌ చేసుకోవడం సులభంగా చేసుకోవచ్చు. చాటింగ్ సెక్షన్‌ కోసం ctrl+alt+shift+f క్లిక్‌ చేస్తే సరిపోతుంది.
  4. న్యూ గ్రూప్‌, న్యూ చాట్‌: అయితే కొత్తగా గ్రూప్‌ క్రియేట్‌ చేసుకునేందుకు ctrl+alt+shift+N క్లిక్‌ చేయాలి. ఇక న్యూ చాట్‌ కోసం ctrl+alt+N ప్రెస్ చేయాల్సి ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సెట్టింగ్స్‌ : వాట్సాప్‌ సెట్టింగ్‌లోకి వెళ్లాలంటే ఏవేవో నొక్కాల్సిన అవసరం లేదు. ముందుగా మెనూలోకి వెళ్లి సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అలాంటిదేమి ఉండకుండా డైరెక్ట్‌గా వెళ్లాలంటే ctrl+alt+, క్లిక్‌ చేస్తే సరిపోతుంది.
  7. ఎగ్జిట్‌ గ్రూప్‌: ఏదైనా గ్రూపు నుంచి బయటకు వెళ్లిపోవాలంటే సాధారణంగా గ్రూప్‌లోని మూడు చుక్కలపై క్లిక్‌ చేసి ఎగ్జిట్‌ గ్రూప్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ctrl+alt+Backspace ప్రెస్ చేస్తే సరిపోతుంది. వ్యక్తిగత చాట్‌లో మెసేజ్‌లను క్లియర్‌ చేసుకోవడానికి దీనిని వాడుకోవచ్చు.
  8. ఇన్‌క్రీజ్‌ లేదా డిక్రీజ్‌ స్పీడ్‌ ఆప్‌ సెలెక్టెడ్‌ వాయిస్‌ మెసేజ్‌: మీరు ఎంచుకున్న వాయిస్ మెసేజ్‌ స్పీడ్‌ను పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి కూడా ఆప్షన్‌ ఉంది. shift+. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
  9. ఆర్కివ్‌ చాట్‌: మామూలుగా డెస్క్‌టాప్‌లో ఏదైనా గ్రూప్‌ను గానీ, వ్యక్తిగత చాటింగ్‌ను ఆర్కివ్‌ చేయాలంటే సులభం చేసుకోవచ్చు. అందుకు ctrl+alt+e క్లిక్‌ చేస్తే సరిపోతుంది.
  10. మ్యూట్‌: ఒక గ్రూప్‌ నుంచి వచ్చే నోటిఫికేషన్స్‌ను మ్యూట్‌ చేయాలంటే సింపుల్‌. ctrl+alt+shift+M ప్రెస్‌ చేస్తే సరిపోతుంది.
  11. ప్రొఫైల్‌ అండ్‌ ఎబౌట్‌: యూజర్‌ ప్రొఫైల్‌ అండ్‌ ఎబౌట్‌ సెక్షన్‌కు వెళ్లేందుకు సింపుల్‌గా ఉంటుంది. ctrl+alt+P క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి