Apple Users Alert: యూపిల్‌ యూజర్లకు అలర్ట్‌.. వీటిని వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి.. ఇకపోతే ఇబ్బందులే..!

|

Aug 02, 2021 | 1:56 PM

Apple Users Alert: భారత్‌లో యాపిల్‌ డివైజ్‌ల యూజర్లకు అలర్ట్‌. వీలైనంత త్వరగా ఐఫోన్లను, ఐప్యాడ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచనలు అందించింది సంస్థ. ఈ మేరకు..

Apple Users Alert: యూపిల్‌ యూజర్లకు అలర్ట్‌.. వీటిని వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి.. ఇకపోతే ఇబ్బందులే..!
Follow us on

Apple Users Alert: భారత్‌లో యాపిల్‌ డివైజ్‌ల యూజర్లకు అలర్ట్‌. వీలైనంత త్వరగా ఐఫోన్లను, ఐప్యాడ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచనలు అందించింది సంస్థ. ఈ మేరకు యూజర్లకు ఐటీ సెక్యూరిటీ ఆర్గనైజేషన్‌ విభాగం సీఈఆర్‌టీ-ఇన్‌ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఐవోఎస్‌14.7.1, ఐప్యాడ్‌ 14.7.1 వారం రోజుల క్రితం విడుదల అయ్యాయి. వీటికి సంక్లిష్టమైన మెమరీ కరప్షన్‌ బగ్‌ను ఫిక్స్‌ చేసే సామర్థ్యం ఉంది. వెంటనే ఆ వెర్షన్‌లకు అప్‌డేట్‌ చేసుకోవాలని యాపిల్‌ యూజర్లకు సూచించింది. మెమరీ కరప్షన్‌ సమస్యలు ఉన్నందున వెంటనే అప్‌డేట్‌ చేసుకోవడం మంచిదని సూచించింది. హ్యాకర్లు పాత అప్‌డేట్‌ ఉన్న ఐఫోన్లలో కోడింగ్‌ను హ్యాక్‌ చేసి.. రిమోట్‌ యాక్సెస్‌ చేసే ప్రమాదం ఉందని వెల్లడించింది. వీటితో పాటు మాక్‌ యూజర్లు(డెస్క్‌టాప్‌ వెర్షన్‌) యూజర్లు కూడా సాప్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసుకుంటే మంచిదని సూచించింది. అయితే ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. తర్వాత సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసుకోవాలి.

అప్‌డేట్‌ చేసుకోవాల్సింది వేటికంటే..

ఐఫోన్‌ 6ఎస్‌, ఆ తర్వాత వచ్చిన మోడల్స్‌, ఐప్యాడ్‌ ప్రో మోడల్స్‌ అన్నీ, ఐప్యాడ్‌ ఎయిర్‌ 2 ఆ తర్వాత వచ్చిన మోడల్స్‌, ఐప్యాడ్‌ ఫిఫ్త్‌ జనరేషన్‌ .. ఆ తర్వాత వచ్చిన డివైజ్‌లు, ఐప్యాడ్‌ మినీ 4-తర్వాతి మోడల్స్‌, ఐప్యాడ్‌ టచ్‌, మోస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ మాక్‌ఓస్‌ బిగ్‌ సర్‌ డివైజ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

ఇవీ కూడా చదవండి

Redmi 9c: రూ.9వేలలోపే రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌.. 128జీబీ స్టోరేజీ.. అద్భుతమైన ఫీచర్స్‌

Google: స్మార్ట్‌ఫోన్‌లపై గూగుల్‌ సంచలన నిర్ణయం.. ఈ ఫోన్‌లలో జీమెయిల్‌, యూట్యూబ్‌ ఇక పని చేయవు..!