Google Two Step Verification: గూగుల్‌ సంచలన నిర్ణయం.. హ్యాకర్లకు చెక్‌.. యూజర్‌ అనుమతి లేకుండానే..

Google Two Step Verification: సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్‌ భద్రత విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి యూజర్‌..

Google Two Step Verification: గూగుల్‌ సంచలన నిర్ణయం.. హ్యాకర్లకు చెక్‌.. యూజర్‌ అనుమతి లేకుండానే..

Updated on: Oct 06, 2021 | 11:05 AM

Google Two Step Verification: సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్‌ భద్రత విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి యూజర్‌ అనుమతితో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకోబోతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న వెరిఫికేషన్‌ను.. మరింత కట్టుదిట్టం చేయనుంది. తద్వారా హ్యాకర్లు గూగుల్‌ అకౌంట్లను అంత తేలికగా హ్యాక్‌ చేయకుండా చేస్తోంది. సాధారణంగా గూగుల్‌ అకౌంట్‌ను రెగ్యులర్‌ డివైజ్‌లలో లాగిన్‌ కానప్పుడు ఓ కన్ఫర్మ్‌ మెసేజ్‌ వస్తుంది. దానిని క్లిక్‌ చేస్తేనే అకౌంట్‌ లాగిన్‌ అవుతుంది. అయితే ఇక నుంచి ఇది రెండు దశల్లో వెరిఫికేషన్‌ ఉంటుందని గూగుల్‌ వెల్లడించింది. హ్యాకర్లు అకౌంట్‌ను హ్యాక్‌ చేయడానికి ఆస్కారం లేకుండా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది

Two-Factor Authentication పేరుతో ఈ సెక్యూరిటీని చాలాకాలం క్రితమే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం గూగుల్‌ క్రోమ్‌, జీమెయిల్‌, ఇతరత్ర గూగుల్‌ అకౌంట్లను అప్‌డేట్‌ కావాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీచర్‌ను యూజర్‌ సెట్టింగ్‌ ద్వారా యాక్టివేట్‌ చేయాల్సిన అవసరమేం లేదు. యూజర్‌ అనుమతి లేకుండా గూగులే ఈ పని చేయనుంది. 2021 డిసెంబర్‌ కల్లా 150 మిలియన్‌ గూగుల్‌ అకౌంట్లను టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ పరిధిలోకి తీసుకురానున్నట్లు గూగుల్‌ పేర్కొంది. ఒకవేళ యూజర్‌ ఈ విధానాన్ని వద్దనుకుంటే సెట్టింగ్‌లోకి వెళ్లి ఆఫ్‌ కూడా చేసుకోవచ్చని గూగుల్‌ పేర్కొంది. మొదటి సారిగా డివైజ్‌లలో లాగిన్‌ అయ్యేవాళ్లకు రెండు సెటప్‌ వెరిఫికేషన్‌ తప్పకుండా కనిపిస్తుందని తెలిపింది. రెగ్యులర్‌ డివైజ్‌లలో అప్పుడప్పుడు నొటిఫికేషన్‌ వస్తుందని గూగుల్‌ తెలిపింది.

ఇవీ కూడా చదవండి:

iPhone 13 Pro Max: ఈ డాక్టర్‌ మాములోడు కాదు.. ఐఫోన్‌13తో కంటి చికిత్స.. నిపుణుల నుంచి ప్రశంసలు

Android Apps: మీ మొబైల్‌లో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి.. 26 డేంజర్‌ యాప్స్‌ను గుర్తించిన గూగుల్‌