Google Best Apps: 2022లో టాప్‌ గేమింగ్‌, ఆండ్రాయిడ్‌ యాప్స్‌ ఇవే..!

|

Dec 03, 2022 | 8:33 PM

2022 సంవత్సరానికి గానూ గూగుల్‌ ఉత్తమ ఆండ్రాయిడ్‌ యాప్‌లు, ఉత్తమ ఆండ్రాయిడ్‌ మొబైల్ గేమ్‌ల జాబితాను విడుదల చేసింది. గూగుల్ ..

Google Best Apps: 2022లో టాప్‌ గేమింగ్‌, ఆండ్రాయిడ్‌ యాప్స్‌ ఇవే..!
Googl 2022 Best Apps
Follow us on

2022 సంవత్సరానికి గానూ గూగుల్‌ ఉత్తమ ఆండ్రాయిడ్‌ యాప్‌లు, ఉత్తమ ఆండ్రాయిడ్‌ మొబైల్ గేమ్‌ల జాబితాను విడుదల చేసింది. గూగుల్ (Google) 2022కి క్వెస్ట్‌ని ఉత్తమ ఆండ్రాయిడ్ యాప్‌గా ఎంపిక చేసింది. అదే సమయంలో అపెక్స్ లెజెండ్స్ మొబైల్ గేమ్ 2022 ఉత్తమ ఆండ్రాయిడ్ మొబైల్ గేమ్‌గా ప్రకటించింది. ఆండ్రాయిడ్ డెవలపర్‌లు ప్రతి సంవత్సరం వేలకొద్దీ యాప్‌లు, గేమ్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌లో పొందుపరుస్తారు. ఆ తర్వాత గూగుల్‌ సంవత్సరం చివరిలో ఈ యాప్‌ల నుండి ఉత్తమ యాప్, ఉత్తమ గేమ్ విజేతలను ప్రకటిస్తుంది.

2022లో బెస్ట్ ఆండ్రాయిడ్ గేమ్స్ యాప్స్‌:

➦ బెస్ట్ గేమ్: అపెక్స్ లెజెండ్స్ మొబైల్ (Apex Legends Mobile)

➦ యూజర్ చాయిస్ గేమ్: యాంగ్రీ బర్డ్ జర్నీ (Angry Birds Journey)

ఇవి కూడా చదవండి

➦ బెస్ట్ మల్టీప్లేయర్ గేమ్: రాకెట్ లీగ్ సైడ్స్ వైప్ (Rocket League Sideswipe)

➦ బెస్ట్ పిక్ అప్ అండ్‌ ప్లే గేమ్: యాంగ్రీ బర్డ్ జర్నీ (Angry Birds Journey)

➦ బెస్ట్ ఇండీస్ గేమ్: డైసీ డంజన్స్ (Dicey Dungeons)

➦ బెస్ట్ స్టోరీ గేమ్: డియాబ్లో ఇమ్మోర్టల్ (Diablo Immortal)

➦ బెస్ట్ ఆన్‍గోయింగ్ గేమ్: క్లాష్ ఆఫ్ క్లాన్స్

2022 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్:

➦ యూజర్స్ చాయిస్ యాప్: షాప్సీ షాపింగ్ యాప్ (Shopsy Shopping App) ఈ ఏడాది ఎక్కువ ఆదరణ పొందిన యాప్‌గా నిలిచింది.

➦ బెస్ట్ యాప్: క్వెస్ట్: నావిగేటర్ ఫర్ లెగ్నింగ్ (Questt) విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఈ యాప్‌ బెస్ట్‌ యాప్‌గా నిలిచింది. కృత్రిమ మేధ ద్వారా విద్యార్థుల అవసరాలను తెలుసుకోవచ్చు. అలాగే నేర్చుకునే క్రమంలో వారికి గేమింగ్‌ అనుభవాన్ని అందించడం ఈ యాప్‌ ప్రత్యేకత.

➦ బెస్ట్ యాప్ ఫర్ గుడ్ యాప్: ఖ్యాల్: సీనియర్ సిటిజన్స్ యాప్ (Khyaal Senior Citizens App)

➦ బెస్ట్ ఫన్ యాప్: టర్నిప్ – టాక్, చాట్ అండ్ స్ట్రీమ్ (Turnip – Talk, chat and Stream)

➦ బెస్ట్ పర్సనల్ గ్రోత్ యాప్: ఫిలో (Filo: Instant 1-to-1 Tutoring)

➦ బెస్ట్ ఎవ్రీ డే ఎసెన్షియల్స్ యాప్: షాప్సీ షాపింగ్ యాప్ (Shopsy Shopping App)

➦ బెస్ట్ హిడెన్ జెమ్స్: బాబీజీ (BabyG: Activity, Tracker, Meal)

➦ బెస్ట్ ఆన్ గోయింగ్ గేమ్స్ సెక్షన్‍ను గూగుల్ ఈసారి కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో క్లాష్ ఆఫ్ క్లాన్స్ టాప్‍లో ఉండగా.. లూడో కింగ్, రియల్ క్రికెట్ 20 ఆ తర్వాత ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి