YouTube Radio Builder: యూ ట్యూబ్ మ్యూజిక్ లవర్స్‪కి ఇక పండగే.. సరికొత్త ఫీచర్ మామూలుగా లేదుగా..

|

Feb 24, 2023 | 12:19 PM

వినియోగదారుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్న యూ ట్యూబ్ అందుకనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు ఆవిష్కరిస్తోంది. ఇదే క్రమంలో మ్యూజిక్ లవర్స్ కోసం రేడియో బిల్డర్ పేరిట ప్రత్యేకమైన ఫీచర్ ని పరిచయం చేసింది.

YouTube Radio Builder: యూ ట్యూబ్ మ్యూజిక్ లవర్స్‪కి ఇక పండగే.. సరికొత్త ఫీచర్ మామూలుగా లేదుగా..
Youtube Music
Follow us on

యూ ట్యూబ్.. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ పై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. ఏ సందేహం వచ్చినా.. ఏ విషయంపై క్లారిటీ కావాలన్నా గూగుల్ లేదా యూ ట్యూబ్ లో సెర్చ్ చేయడం ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో అలవాటు అయిపోయింది. ఇదే క్రమంలో వినియోగదారుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్న యూ ట్యూబ్ అందుకనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు ఆవిష్కరిస్తోంది. ఇదే క్రమంలో యూ ట్యూబ్ మ్యూజిక్ లవర్స్ కోసం ఓ ప్రత్యేకమైన అప్ డేట్ ని యూ ట్యూబ్ పరిచయం చేసింది. రేడియో బిల్డర్ పేరిట దీనిని ఆవిష్కరించింది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిపైనా పనిచేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎక్కడ ఉంటుంది..

గూగుల్ అభివృద్ధి చేసిన యూ ట్యూబ్ లో యూ ట్యూబ్ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది. దీనిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు యూ ట్యూబ్ మ్యూజిక్ లోనే రేడియో బిల్డర్ అనే కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఇది వినియోగదారులు తమకు ఇష్టమైన జోనర్ లో పాటలను అన్ని ఒక దగ్గర చేర్చుకొని స్టేషన్ తయారు చేసుకోవచ్చు. దీనిని గత మంగళవారం యూ ట్యూబ్ లో ఆవిష్కరించారు. యూ ట్యూబ్ లోని యూ ట్యూబ్ హోమ్ పేజీపై యువర్ మ్యూజిక్ టెనర్ సెక్షన్ లో ఈ రేడియో బిల్డర్ ఫీచర్ మీకు కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రత్యేకతలు ఇవి..

  • ఈ రేడియో బిల్డర్ ఫీచర్ తో మీరు 30 వరకూ ఆర్టిస్ట్ లను ఎంపిక చేసుకొని వారి పాటలు అందులో ప్లే అయ్యేటట్లు చేసుకోవచ్చు.
  • ఎంత తరచుగా అవి ప్లే అవ్వాలో కూడా మీరు నిర్ణయించవచ్చు.
    అలాగే మీరు ఎంపిక చేసుకున్న ఆర్టిస్ట్ నుంచి మాత్రమే వినాలనుకున్నా లేదా ఇతర ఆర్టిస్ట్ ల సాంగ్స్ వినాలన్నా దీనిని ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఈ రేడియో బిల్డర్ అప్ డేట్ లో మీరు ఎంపిక చేసుకున్న ప్లే లిస్ట్ కి ఫిల్టర్లు అప్లై చేసుకోవచ్చు. దీనిలో చిల్, డౌన్ బీట్, పంప్ అప్ వంటి కేటగిరీల్లో సాంగ్స్ ని ఫిల్టర్ చేసుకొని ప్లే లిస్ట్ సెట్ చేసుకోవచ్చు.
  • మీరు రేడియో స్టేషన్ క్రియేట్ చేయాలంటే యూ ట్యూబ్ మ్యూజిక్ లోకి వెళ్లి మొదట దీనిని యాక్టివేట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్రియేట్ రేడియో ఆప్షన్ ని ఎంపిక చేసుకొని ఆర్టిస్ట్ లను సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఈ ఫీచర్ ని ఎక్కడి నుంచైనా, ఎవరైనా వినియోగించుకోవచ్చని గూగుల్ ప్రకటించింది. యూ ట్యూబ్ పెయిడ్ సబ్ స్క్రైబర్స్, అలాగే ఫ్రీ యూజర్లు కూడా వినియోగించుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి