ట్విట్టర్ మార్గంలో గూగుల్ ప్రయాణిస్తోంది. వినియోగదారుల సెక్యూరిటీ విషయంలో ఎక్కడా రాజీ పడమని స్పష్టం చేస్తోంది.వెరిఫైడ్ అకౌంట్లకు ట్విట్టర్ ప్రత్యేక రంగుల్లో టిక్ మార్క్ ఇస్తున్నట్టుగా ఇకపై జీమెయిల్ కూడా తమ అకౌంట్లకూ బ్లూ టిక్ మార్క్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వినియోగదారుల గుర్తింపును ధృవీకరించడానికి, ఆన్లైన్ స్కామ్‌లను తగ్గించడానికి, ఈ మెయిల్ పంపినవారి పేరు పక్కన బ్లూ చెక్‌మార్క్‌ను తీసుకు వస్తున్నట్టు గూగుల్ వివరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
బ్లూ టిక్ మార్క్ సాయంతో వినియోగదారులు నకిలీ అకౌంట్ల నుంచి వచ్చే ఫిషింగ్ దాడుల నుంచి తమని తాము కాపాడుకోవచ్చని గూగుల్ పేర్కొంది. ఇక బీఐఎంఐను వినియోగిస్తున్న సంస్థలన్నిటీకి ఆటోమేటిక్‌గా బ్లూ టిక్ మార్క్ జారీ అవుతుంది. 2021లో గూగుల్ కంపెనీ జీమెయిల్లో మెసేజ్ ఐడెంటిఫికేషన్ కోసం బ్రాండ్ సూచికలను (బీఐఎంఐ) పరిచయం చేసింది. ఇది ఈమెయిల్‌లలో బ్రాండ్ లోగోను అవతార్‌గా చూపించాలంటే పంపినవారు బలమైన ధృవీకరణను ఉపయోగించాలి . వారి బ్రాండ్ లోగోను ధృవీకరించాలి. అయితే, ఈ టిక్ మార్క్ ను గూగుల్ ప్రస్తుతానికి ఉచితంగానే జారీ చేస్తోంది.
Look for the blue checkmark next to a company’s name in your emails to make sure they’re the real deal before you respond. Learn more ? https://t.co/KIBkdFJOzr pic.twitter.com/Fe5MkBjuXO
— Gmail (@gmail) May 3, 2023
అయితే ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అయితే తొలి దశలో గూగుల్ వర్క్ స్పేస్ కస్టమర్‌లు, లెగసీ జి సూట్ బేసిక్, బిజినెస్ కస్టమర్, ఇంకా, వ్యక్తిగత గూగుల్ ఖాతాలు ఉన్న యూజర్‌లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను టేకోవర్ చేసిన తర్వాత, తన ప్లాట్‌ఫారమ్‌లోని అన్ని లెగసీ బ్లూ బ్యాడ్జ్‌లను తీసివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గూగుల్ బ్లూ చెక్ మార్క్ ని ప్రవేశపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ట్విట్టర్ లో ఇప్పుడు ఈ బ్లూ టిక్‌ల కోసం వ్యక్తిగత వినియోగదారుల నుండి నెలకు రూ. 900 (సంవత్సరానికి రూ. 9,400), గోల్డ్ టిక్‌ల కోసం సంస్థల నుంచి 1,000 డాలర్లను వసూలు చేస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..