Google: ఇంట్రెస్టింగ్‌ AI ఫీచర్‌ తీసుకొచ్చిన గూగుల్‌.. టెక్ట్స్‌ ఎంటర్ చేస్తే చాలు..

ఈ క్రమంలోనే ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. టెక్ట్స్ ఆధారంగా ఇమేజ్‌లను తయారు చేసుకునే సెర్చ్‌ జనరేటివ్‌ ఎక్స్‌పీరియన్స్‌ (SGE)ని పరిచయం చసింది. ఇటీవల వాట్సాప్‌ ఇలాంటి ఓ ఫీచర్‌నే తీసుకొచ్చింది. అయితే ఇందులో కేవలం వాయిస్‌ ఆధారంగా స్టిక్కర్లను...

Google: ఇంట్రెస్టింగ్‌ AI ఫీచర్‌ తీసుకొచ్చిన గూగుల్‌.. టెక్ట్స్‌ ఎంటర్ చేస్తే చాలు..
Google AI Feature

Edited By: TV9 Telugu

Updated on: Oct 16, 2023 | 6:47 PM

ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హవా నడుస్తోంది. ప్రతీ రంగంలో కృత్రిమ మేధ వినియోగం పెరిగిపోతోంది. ఐటీ మొదలు ఇతర రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనివార్యంగా మారింది. ఒక ఏఐ రాకతో అప్పటి వరకు మాములు సేవలు అందించిన సంస్థలు సరికొత్త సేవలు అందిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. టెక్ట్స్ ఆధారంగా ఇమేజ్‌లను తయారు చేసుకునే సెర్చ్‌ జనరేటివ్‌ ఎక్స్‌పీరియన్స్‌ (SGE)ని పరిచయం చసింది. ఇటీవల వాట్సాప్‌ ఇలాంటి ఓ ఫీచర్‌నే తీసుకొచ్చింది. అయితే ఇందులో కేవలం వాయిస్‌ ఆధారంగా స్టిక్కర్లను రూపొందించుకునే అవకాశం కల్పించింది. కానీ గూగుల్‌ దీనికి కొనసాగింపుగా టెక్ట్‌ ఆధారంగా ఏకంగా ఇమేజ్‌లను రూపొందించే టెక్నాలజీని తీసుకొస్తోంది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అమెరికాలోని గూగుల్‌ సెర్చ్‌ ల్యాబ్స్‌ ప్రోగ్రామ్‌లో యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే ఈ ఫీచర్‌ను ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. గూగుల్‌ సెర్చ్‌లో ల్యాబ్స్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం మీ ఐడియాల ఆధారంగా ఫొటోలను క్రియేట్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా సదరు ఫొటోకు అనుగుణంగా, సరిపోలే వాటిని కూడా పక్కన చూసుకోవచ్చు. యూజర్లకు సెర్చింగ్ అనుభవాన్ని మరింత పెంచేందుకు గానే గూగుల్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది.

త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు గూగుల్ తెలిపింది. ఈ కొత్త ఫీచర్‌తో సెర్చింగ్‌లో సరికొత్త అనుభూతిని పొందొచ్చని గూగుల్ చెబుతోంది. గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. జెనరేటివ్ AI యూజర్లను సెర్చ్ ఫలితాలను వేగంగా అర్థం చేసుకోవడంతో పాటు కొత్త విషయాలు, ఇతర సంబంధిత అంశాలను సులభంగా లోతుగా అధ్యయనం చేయడానికి సాయపడుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..