AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Earth: విమానంలో ఎగురుతూ మీకు ఇష్టమైన ప్రదేశాలను చూసే అవకాశం.. సెకన్లలోనే యాక్సెస్..

గూగుల్ ఎర్త్ వినియోగదారులకు శుభవార్త. గూగుల్ మరో అదిరిపోయే ఫీచర్ కొత్తగా తీసుకుకొచ్చింది. ఇక నుంచి మీరు గూగుల్ ఎర్త్ ఫ్లైట్ సిమ్యులేటర్‌ ఫీచర్ యాక్సెస్ చేయడానికి డెస్క్‌టాప్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వెబ్ బ్రౌజర్ నుంచే ఈ ఫీచర్‌ను ఇక నుంచి ఉపయోగించుకోవచ్చు.

Google Earth: విమానంలో ఎగురుతూ మీకు ఇష్టమైన ప్రదేశాలను చూసే అవకాశం.. సెకన్లలోనే యాక్సెస్..
Google Earth
Venkatrao Lella
|

Updated on: Jun 16, 2026 | 11:45 AM

Share

విమానం పైనుంచి చూసినట్లు పర్వతాలు, సముద్రాలు, మీకు ఇష్టమైన ప్రదేశాలను వర్చువల్‌గా ఆస్వాదించాలనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. గూగుల్ ఎర్త్‌లో గూగుల్ మరో అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఫ్లైట్ సిమ్యులేటర్‌ ఫీచర్‌ను వెబ్ వెర్షన్‌లో కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు డెస్క్‌టాప్ యాప్ ద్వారా ఈ ఫీచర్ ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు డెస్క్‌టాప్ యాప్ ఇన్‌స్టాల్ చేయకుండానే వెబ్ బ్రౌజర్ ద్వారా ఫ్లైట్ సిమ్యులేటర్‌ ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు. బ్రౌజర్ నుంచే మీకు ఇష్టమైన ప్రదేశాలను ఫ్లైట్‌లో ఎగురుతూ వర్చువల్‌గా ఆస్వాదించవచ్చు. ఇప్పటివరకు గూగుల్ ఎర్త్ డెస్క్‌టాప్ ఫ్లాట్‌ఫామ్‌లో ఉన్న ఈ ఫీచర్.. ఇప్పుడు వెబ్ బ్రౌజర్‌లో కూడా రావడం వినియోగదారులకు ఊరట కలిగించే న్యూస్‌గా చెప్పవచ్చు. వెబ్ సైట్ ఇంటర్‌ఫేస్‌కు మరిన్ని అధునాతన గూగుల్ ఎర్త్ ఫీచర్లను జోడించాలనే ఉద్దేశంతో గూగుల్ ఈ అప్డేట్ తీసుకొచ్చింది.

ఇకపై వెబ్ బ్రౌజర్‌లో కూడా..

ఎలివేషన్ ప్రొఫైల్స్, కొత్త ఇంపోర్ట్ రకాలు, అదనపు డేటా లేయర్‌ల వంటి ఫీచర్లను ఉపయోగించే వినియోగదారుల కోసం ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని గూగుల్ తెలిపింది. వెబ్ బ్రౌజర్ వినియోగదారులకు పూర్తిస్థాయి విమానయాన అనుభవాన్ని అందించేందుకు ఈ ఫీచర్ తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. సాధారణ అన్వేషణ కోసం దీనిని ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ల్యాప్ టాప్ స్క్రీన్ నుంచే పర్వతాలు, ప్రముఖ ప్రదేశాలు, వివిధ నగరాల మీదుగా ఫ్లైట్‌లో వర్చువల్‌గా ఎగరడానికి ఉపయోగపడుతుందని తెలిపింది. 2007 నుంచి గూగుల్ ఎర్త్ డెస్క్ టాప్ వెర్షన్‌లో మాత్రమే ఈ ఫీచర్ ఉంది. ఇప్పుడు వెబ్ బ్రౌజర్‌లో కూడా రావడంతో వినియోగదారులు పాత డెస్క్‌టాప్ వెర్షన్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోకుండానే బ్రౌజర్ నుంచే గూగుల్ ఎర్త్ తెరిచి ఉపయోగించుకోవచ్చు.

ఫ్లైట్ సిమ్యులేటర్‌ ఫీచర్ ఎలా ఉపయోగించాలి..?

-కంప్యూటర్‌లో గూగుల్ ఎర్త్ ఓపెన్ చేయాలి

-హోమ్ స్క్రీన్‌పై కనిపించే ఎక్స్‌ప్లోర్ ఎర్త్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి

-మోనూ బార్ నుంచి టూల్స్ మోనూను ఎంచుకోవాలి

-ఆ తర్వాత ఫ్లైట్ సిమ్యులేటర్‌ను ఎంచుకోవాలి

-మీరు ఫ్లైట్ మోడ్‌లో వెళ్లేటప్పుడు 3డీ భవనాలు, అధిక రిజల్యూషన్ కలిగిన ఫొటోలు డైనమిక్‌గా లోడ్ అవుతాయి

-ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్నప్పుడు మీరు వేగంగా వెళుతుంటే కొంత ఆలస్యం కావొచ్చు

-ఫ్లైట్ నేలను ఢీకొడితే సిమ్ములేటర్ పాజ్ అవుతుంది

-మీరు కూలిపోయారు.. మళ్లీ ప్రయత్నించండి అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మళ్లీ మీరు పాత స్థితికి వస్తారు

-ఇంటర్నెట్ కనెక్టివిటీ స్పీడ్‌గా ఉంటే మీకు మెరుగైన అనుభవాన్ని పొందవచ్చు

Follow Us