Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు షాక్.. జనవరి 15 నుంచి ఆ కంప్యూటర్లకు సేవల నిలిపివేత

| Edited By: Anil kumar poka

Jan 06, 2023 | 6:03 PM

వినియోగదారుల అభిరుచికి తగినట్టే క్రోమ్ ను అప్ డేట్ చేస్తూ వివిధ ఫీచర్స్ తో అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రోమ్ యూజర్లకు గూగుల్ ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. జనవరి 15 నుంచి కొన్ని కంప్యూటర్లకు తన సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 

Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు షాక్.. జనవరి 15 నుంచి ఆ కంప్యూటర్లకు సేవల నిలిపివేత
Google Chrome
Follow us on

ప్రస్తుతం అంతా తమ ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లలో విరివిగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ నే వాడుతున్నారు. గూగుల్ క్రోమ్ కు పోటీగా ఎన్ని బ్రౌజర్లు వచ్చినా క్రోమ్ అందిస్తున్న ఫీచర్స్ కు వినియోగదారులు బాగా ఆకర్షితమై క్రోమ్ బ్రౌజర్ నే వాడుతున్నారు. వినియోగదారుల అభిరుచికి తగినట్టే క్రోమ్ ను అప్ డేట్ చేస్తూ వివిధ ఫీచర్స్ తో అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రోమ్ యూజర్లకు గూగుల్ ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. జనవరి 15 నుంచి కొన్ని కంప్యూటర్లకు క్రోమ్ బ్రౌజర్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 

ఆ వెర్షన్లకు లేనట్టే

విండోస్ 7, 8.1 వెర్షన్లకు జనవరి 15 నుంచి సేవలను నిలిపివేస్తున్నట్లు తన సపోర్ట్ పేజీలో పేర్కొంది. ఈ వెర్షన్లకు ప్రస్తుతం క్రోమ్ 109 ద్వారా సేవలను అందిస్తుంది. అయితే క్రోమ్ వెర్షన్ లో అప్ డేట్స్ కావాలంటే కచ్చితంగా విండోస్ 10 ఓఎస్ మారాల్సిందేనని స్పష్టం చేసింది. విండోస్ 10 లో ప్రస్తుతం క్రోమ్ 110 ద్వారా సేవలను అందిస్తుంది. కాబట్టి వినియోగదారులు భవిష్యత్ లో క్రోమ్ సెక్యూరిటీ అప్ డేట్స్ పొందాలంటే కచ్చితంగా విండోస్ 10కు అప్ డేట్ అవ్వాల్సి ఉంటుంది. అయితే వినియోగదారులకు కొంత ఊరటనిచ్చే విషయం ఏంటంటే ప్రస్తుతం విండోస్ 7,8.1 ఓఎస్ లో క్రోమ్ అప్ డేట్స్ రావు..కానీ క్రోమ్ మాత్రం యధావిధిగా పని చేస్తుంది. కానీ, సెక్యూరిటీ నిమిత్తం వినియోగదారులు విండోస్ 10 కు అప్ గ్రేడ్ చేసుకుంటే మంచిది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..