AI: విద్యా రంగంలో ఏఐ సరికొత్త విప్లవం.. గూగుల్‌ బార్డ్‌లో సూపర్ ఫీచర్‌.

ఇదిలా ఉంటే ఓవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఎన్నో రకాల దుష్ఫ్రభావాలు ఉన్నాయన్న వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న డీప్‌ ఫేక్‌ వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ కొత్త టెక్నాలజీతా నష్టాలు ఉన్నట్లే, లాభాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ విప్లవాత్మక మార్పులకు...

AI: విద్యా రంగంలో ఏఐ సరికొత్త విప్లవం.. గూగుల్‌ బార్డ్‌లో సూపర్ ఫీచర్‌.
Google Bard
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 18, 2023 | 10:11 PM

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రపంచాన్ని శాసిస్తోంది. వినోదం, విజ్ఞానం.. ఇలా అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. ఇప్పటికే ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లకు డిమాండ్‌ పెరుడుతోంది. చాట్‌జీపీటీతో పాటు గూగుల్‌ బార్డ్‌ పేరుతో చాట్‌బాట్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఓవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఎన్నో రకాల దుష్ఫ్రభావాలు ఉన్నాయన్న వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న డీప్‌ ఫేక్‌ వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ కొత్త టెక్నాలజీతా నష్టాలు ఉన్నట్లే, లాభాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. తాజాగా గూగుల్‌ చాట్బాట్‌ బార్డ్‌లో తీసుకొచ్చిన ఓ కొత్త ఫీచర్‌ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది.

మొదట్లో అమెరికా, యూకేలో అందుబాటులోకి వచ్చిన గూగుల్ బార్డ్‌ ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం గూగుల్‌ బార్డ్‌ను భారత్‌తో పాటు 108 దేశాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూ వస్తోన్న గూగుల్‌ తాజాగా విద్యార్థుల కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. విద్యార్థుల.. సైన్స్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన సలహాలు, పాఠశాలలు, కాలేజ్ స్టూడెంట్స్‌కి ఉపయోగపడేలా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు.

ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు.. మ్యాథ్స్, సైన్స్, క్లిష్టమైన సమస్యలకు సమాధానాలను సులభమైన విధానంలో తెలుసుకునేలా బార్డ్‌ను అప్‌డేట్ చేశారు. ఇందుకోసం యూజర్లు తమకు కావాల్సిన సమస్యను టైప్‌ చేయడం లేదా ఫొటోను అప్‌లోడ్ చేస్తే చాలు సమస్యను ఎలా పరిష్కరించవచ్చో సులభమైన విధానాన్ని చాట్‌బాట్‌ అందిస్తుంది. విద్యార్థులకు అర్థం అయ్యే విధంగా చార్ట్‌లు, టేబుల్స్‌ రూపంలో ఉంటాయి. వీటితో పాటు అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన సూచనలు కూడా పొందవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..