Google AI: ఏఐ బాట పడుతున్న గూగుల్.. సెర్చ్ ఇంజిన్‌లోనూ ఏఐ సాయం

ఇటీవల ప్రతి స్మార్ట్ ఫోన్ వినియోగం అనేది పరిపాటిగా మారింది. ప్రతి విషయానికి గూగుల్‌పై ఆధారపడే వారి సంఖ్య కూడా పెరిగింది. సరదాగా గూగుల్‌ను గూగుల్ తల్లి అంటూ ఉంటారు. ఇంత ప్రజాదరణ పొందిన గూగుల్ ఎప్పటికప్పుడు పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా గూగుల్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. తాజాగా గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌కు ఏఐ మోడ్‌ను తీసుకొస్తుంది. ఈ తాజా అప్‌డేట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Google AI: ఏఐ బాట పడుతున్న గూగుల్.. సెర్చ్ ఇంజిన్‌లోనూ ఏఐ సాయం
Ai

Updated on: Jun 11, 2025 | 6:48 PM

గూగుల్ తన ఏఐ మోడ్ ఫర్ సెర్చ్‌లో ‘సెర్చ్ లైవ్’ అనే కొత్త వాయిస్-పవర్డ్ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొదట్లో గూగుల్ ఐ/ఓ 2025లో ప్రివ్యూ చేసిన ఈ ఫీచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లోని గూగుల్ యాప్ ద్వారా యూఎస్‌లోని ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. జెమిని అసిస్టెంట్-నిర్దిష్ట ఇంటర్‌ఫేస్ లా కాకుండా సెర్చ్ లైవ్ నేరుగా గూగుల్ సెర్చ్‌లో విలీనం చేశారు. సహజమైన రియల్ టైమ్ సంభాషణ ద్వారా సమాచారాన్ని శోధించడానికి వినియోగదారులకు కొత్త మార్గాన్ని అందిస్తుంది.

సెర్చ్ లైవ్ ద్వారా వినియోగదారులు తమ ప్రశ్నలను వాయిస్ ద్వారా గూగుల్‌కు అందించవచ్చు. సెర్చ్‌ను టైప్ చేసి లింక్‌ల ద్వారా శోధించడానికి బదులుగా వినియోగదారులు వాయిస్ మోడ్ ద్వారా ప్రశ్నలు అడగవచ్చు. అలాగే వాటి సమిష్టిగా సమాధానాలను వారికి తిరిగి చదివి చెబుతుంది. ఈ ఫీచర్ టాకింగ్ టాస్క్‌లో తదుపరి ప్రశ్నలను కూడా అనుమతిస్తుంది. వినియోగదారులు కావాలనుకుంటే వారు ఆడియోను మ్యూట్ చేయవచ్చు. అలాగే శోధన ఫలితాన్ని ట్రాన్స్క్రిప్ట్ వలె చదవవచ్చు. 

ఈ ఫీచర్ ప్రాజెక్ట్ ఆస్ట్రా ఆధారంగా పని చేస్తుంది. రియల్ టైమ్‌లో మాట్లాడే ఇన్‌పుట్‌ను ప్రాసెస్ చేస్తుంది. సెర్చ్‌లో అంతర్నిర్మితంగా ఉన్న స్మార్ట్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. లైవ్ ఇన్ జెమిని యాప్ అనేది ప్రాజెక్ట్ ఆస్ట్రా ద్వారా ఆధారితమైన మరొక ఫీచర్. దీని ద్వారా వినియోగదారులు శోధన పట్టీ కింద స్పార్కిల్-బ్యాడ్జ్డ్ వేవ్‌ఫారమ్ చిహ్నాన్ని చూస్తారు. దీన్ని నొక్కడం ద్వారా వాయిస్ ఇంటరాక్షన్ ఫీచర్ సక్రియం అవుతుంది. నాలుగు వాయిస్ సెట్టింగ్‌లను అందిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి