Google: యూజర్లను హెచ్చరించిన గూగుల్‌.. క్రోమ్‌ బ్రౌజర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని సూచన..

|

May 12, 2022 | 4:16 PM

Google: మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు భౌతికంగా దోపిడి చేసే నేరగాళ్ల స్థానంలో ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లు వచ్చారు. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని ఖాతాదారుల అకౌంట్లలో డబ్బులు కొట్టేస్తున్నారు...

Google: యూజర్లను హెచ్చరించిన గూగుల్‌.. క్రోమ్‌ బ్రౌజర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని సూచన..
Follow us on

Google: మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు భౌతికంగా దోపిడి చేసే నేరగాళ్ల స్థానంలో ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లు వచ్చారు. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని ఖాతాదారుల అకౌంట్లలో డబ్బులు కొట్టేస్తున్నారు. అయితే సైబర్‌ నేరగాళ్లు (Cyber criminals) రెచ్చి పోవడానికి ప్రధాన కారణం మనం ఉపయోగించే బ్రౌజర్లలో ఉండే భద్రతా లోపాలే. బ్రౌజర్లలోని సెక్యూరిటీ లోపాలను తమకు అనుకూలంగా మార్చుకొని యూజర్ల డేటాను కొట్టేస్తుంటారు. తాజాగా గూగుల్‌ క్రోమ్‌ (Google Chrome)లోనూ ఇలాంటి భద్రతా లోపాలను కనుగొన్నారు.

సుమారు 3 బిలియన్ల మంది వాడుతోన్న క్రోమ్‌ బ్రౌజర్లలో 13 సెక్యూరిటీ థ్రెట్స్‌ను కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. అయితే హ్యాకర్స్‌ ఏదైనా చోరీకి పాల్పడ్డారా.?లేదా అన్న దానిపై మాత్రం ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని, యూజర్లు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వీలైనంత త్వరగా బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని తెలిపారు. సాధారణంగా బ్రౌజర్స్‌లో షాపింగ్‌ చేసే సమయంలో ఉపయోగించే ఐడీ, పాస్‌వర్డ్‌లను సైబర్‌ నేరగాళ్లు కొట్టేస్తుంటారు. కాబట్టి అలాంటి వాటికి చెక్‌ పెట్టడానికే క్రోమ్‌ బ్రౌజర్‌కు ఎమర్జెన్సీ అప్‌డేట్లు ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే డెస్క్‌టాప్‌ యూజర్ల కోసం ప్రత్యేకంగా 101.0.4951.64 వెర్షన్‌ను విడుదల చేసిన గూగుల్ వెంటనే అప్‌డేట్‌ చేసుకోమని తెలిపింది. బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలనుకునే వారు ముందుగా క్రోమ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి, కుడివైపు ఉండే మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్‌ ఆప్షన్స్‌లోకి వెళ్లాలి. అనంతరం ‘అబౌట్‌ క్రోమ్‌’ని క్లిక్‌ చేసి, రీలాంచ్‌ చేసి అప్‌డేట్ చేయాలి. ఒకవేళ బ్రౌజర్‌ అటోమేటిగ్‌గా అప్‌డేట్‌ అయి ఉంటే లేటెస్ట్ వెర్షన్‌ను చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తలకు క్లిక్ చేయండి..