Airtel: ఎయిర్‌టెల్ ఆఫర్ వాడుతున్నారా ?.. ఓటీటీలతో పాటు రూ.599 లకే ఫ్యామిలీ ప్లాన్

|

May 20, 2023 | 4:17 AM

మార్చి నెలలలో తీసుకొచ్చిన నెలవారీ రూ.599 పోస్ట్‌పెయిడ్‌ ప్లాటినం ఫ్యామిలీ ప్లాన్‌ కు మంచి ఆదరణ లభిస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ సీఈఓ ఇటీవల మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్న సందర్భంలో తెలిపారు. 5జీ సేవల విస్తరణలో ఈ ఫ్యామిలీ ప్లాన్లు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Airtel: ఎయిర్‌టెల్ ఆఫర్ వాడుతున్నారా ?.. ఓటీటీలతో పాటు రూ.599 లకే ఫ్యామిలీ ప్లాన్
Airtel
Follow us on

మార్చి నెలలలో తీసుకొచ్చిన నెలవారీ రూ.599 పోస్ట్‌పెయిడ్‌ ప్లాటినం ఫ్యామిలీ ప్లాన్‌ కు మంచి ఆదరణ లభిస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ సీఈఓ ఇటీవల మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్న సందర్భంలో తెలిపారు. 5జీ సేవల విస్తరణలో ఈ ఫ్యామిలీ ప్లాన్లు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇందులో ఉండే ఫీచర్లను గమనిస్తే ఇందులో ఉండే ప్రయోజనాలన్నింటిని ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు. ప్రైమరీ యూజర్ ఆ ప్లాన్‌ను మేనేజ్ చేస్తుంటారు. అలాగే కావాల్సినప్పుడుల్లా మరొక కుటంబ సభ్యున్ని యాడ్ చేయడం లేదా తొలగించడం లాంటివి చేయొచ్చు. అయితే ఈ ప్లాన్‌లోకి కొత్తగా ఎవరు వచ్చినా సెకండరీ యూజర్ కోటా కింజ ఉన్న డేటాను వినియోగించుకోవచ్చు.

అయితే ప్లాన్‌లో ఉన్న ఇద్దరికీ కూడా అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. ఇక డేటా విషయానికొస్తే ఇద్దరికీ కలిపి 105 జీబీ డేటా లభిస్తుంది. దీంట్లో 75 జీబీ ప్రైమరీ యూజర్‌కు, మిగిలిన 30 జీబీ సెకండరీ యూజర్‌ కోటాలో ఉంటుంది. వినియోగించని డేటాను మరుసటి నెలకు 200జీబీ వరకు బదిలీ చేసుకునే అవకాశం కూడా ఉంది.అలాగే ఓటీటీ సర్వీసులైన అమెజాన్‌ ప్రైమ్‌ ఆరు నెలల సభ్యత్వం, ఏడాదిపాటు డిస్నీ-హాట్‌స్టార్‌ మొబైల్‌, ఎక్స్‌స్ట్రీమ్‌ మొబైల్‌ ప్యాక్‌లు కూడా లభిస్తాయి. ఈ రూ.599 ప్లాన్‌పై ఎయిర్‌టెల్‌ యాడ్‌- ఆన్‌ సదుపాయం కూడా కల్పిస్తోంది. ప్రైమరీ, సెకండరీ యూజర్లతో పాటు మరో 8 మంది కుటుంబ సభ్యులను ప్లాన్‌లో యాడ్‌ చేసుకోవచ్చు. అయితే ప్రతి కనెక్షన్‌కు రూ.299 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రతి వ్యక్తికి 30 జీబీ డేటా అదనంగా లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..