Jio Dive VR Headset: క్రికెట్ లవర్స్‌కు జియో గుడ్ న్యూస్.. రియాలిటీ అనుభూతి చెందేలా వీఆర్ హెడ్‌సెట్ విడుదల..

|

May 02, 2023 | 5:15 PM

ప్రస్తుతం ఫోన్స్‌లోనే క్రికెట్‌ను అధిక శాతం మంది యువత వీక్షిస్తున్నారు. ముఖ్యంగా పెరిగిన పని ఒత్తిడి కారణంగా ఎక్కడ నుంచైన క్రికెట్‌ను వీక్షించవచ్చు అనే ఉద్దేశంలో ఎక్కువ మంది ఫోన్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో టెలికాం ఆపరేటర్లు కూడా ఐపీఎల్ సీజన్ కోసం యువతను ఆకట్టుకోవడానికి వివిధ ఆఫర్లను ప్రవేశపెడుతూ ఉంటాయి.

Jio Dive VR Headset: క్రికెట్ లవర్స్‌కు జియో గుడ్ న్యూస్.. రియాలిటీ అనుభూతి చెందేలా వీఆర్ హెడ్‌సెట్ విడుదల..
Jiodive
Follow us on

ప్రస్తుతం క్రికెట్ ప్రేమికులు ఐపీఎల్ సీజన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.  క్రికెట్‌ను ఎంజాయ్ చేసే వారు కచ్చితంగా మ్యాచ్‌ను టీవీలో వీక్షించి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే మారిన టెక్నాలజీ ప్రకారం ప్రస్తుతం ఫోన్స్‌లోనే క్రికెట్‌ను అధిక శాతం మంది యువత వీక్షిస్తున్నారు. ముఖ్యంగా పెరిగిన పని ఒత్తిడి కారణంగా ఎక్కడ నుంచైన క్రికెట్‌ను వీక్షించవచ్చు అనే ఉద్దేశంలో ఎక్కువ మంది ఫోన్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో టెలికాం ఆపరేటర్లు కూడా ఐపీఎల్ సీజన్ కోసం యువతను ఆకట్టుకోవడానికి వివిధ ఆఫర్లను ప్రవేశపెడుతూ ఉంటాయి. ఈ పరిస్థితి ఎలా ఉన్నా అసలైన క్రికెట్ మజా మాత్రం సగటు ప్రేక్షకుడు కోల్పోతున్నాడు. దీంతో ఇలాంటి వారి ప్రముఖ టెలికాం కంపెనీ జియో కొత్త వీఆర్ హెడ్‌సెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా క్రికెట్ ప్రేమికులు ఐపీఎల్ 2023 వర్చువల్ రియాలిటీలో ఎంజాయ్ చేసేందుకు జియో డైవ్ అనే కొత్త వీఆర్ హెడ్‌సెట్‌ను జియో ప్రారంభించింది. జియో సినిమా యాప్‌లో ఐపీఎల్‌ని ఆన్‌లైన్‌లో చూస్తున్న వారు వీఆర్ హెడ్‌సెట్‌ని ఉపయోగించి చూడవచ్చు. వంద అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీ వీక్షణ వంటి ఫీచర్లు ఉన్నాయి. . ముఖ్యంగా ఈ పరికరం ప్రత్యేకంగా జియో వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించారు. అయితే ఈ హెడ్‌సెట్‌ను ఎలా ఉపయోగించాలో? ఓ సారి తెలుసుకుందాం.

  • బాక్స్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి జియో ఇమ్మర్స్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి.
  • ఇప్పుడు సూచించిన విధంగా అన్ని అనుమతులను ఇచ్చి లాగిన్ చేయాలి. ఈ పరికరాన్ని వాడాలంటే కచ్చితంగా జియో నెట్‌వర్క్‌ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని గుర్తుంచుకోవాలి.
  • జియో డైవ్‌ను ఎంచుకుని, వాచ్ ఆన్ డైవ్ పై నొక్కాలి.
  • జియో డైవ్‌లో ఫోన్ సపోర్ట్ క్లిప్, లెన్స్‌ల మధ్య ఫోన్‌ను ఉంచడానికి ముందు కవర్‌ని తెరవాలి. 
  • అనంతరం జియో డైవ్ హెడ్‌సెట్‌ను ధరించి సర్దుబాటు చేసుకోవాలి.
  • ఉత్తమ వీక్షణ అనుభవం కోసం చిత్ర నాణ్యతను సర్దుబాటు చేయడానికి మధ్య, పక్కన ఉన్న బటన్స్‌ను ఉపయోగించండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..