Fact Check: రామమందిర ప్రారంభ సందర్భంగా ఫ్రీగా రూ.749 రీచార్జ్…నమ్మారా..? నట్టేట మునిగినట్లే..!

రామమందిర ప్రారంభం సందర్భంగా మోదీ-యోగి ప్రభుత్వం రూ.749 రీచార్జ్‌ ఫ్రీగా ఇస్తున్నారని, దాన్ని పొందాలంటే మాత్రం ఓ లింక్‌ను క్లిక్‌ చేయాలని సూచిస్తూ ఓ మెసేజ్‌ వాట్సాప్‌లో హల్‌చల్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మెసేజ్‌ ఆధారంగా నిజంగా రీచార్జ్‌ వస్తుందా? టెక్‌ నిపుణులు ఏం చెబుతున్నారో? ఓ సారి తెలుసుకుందాం.

Fact Check: రామమందిర ప్రారంభ సందర్భంగా  ఫ్రీగా రూ.749 రీచార్జ్…నమ్మారా..? నట్టేట మునిగినట్లే..!
Recharge Plan

Updated on: Jan 24, 2024 | 7:30 AM

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం కన్నుల పండువగా సాగింది. దేశంలోని ప్రముఖులంతా రాముని ప్రాణప్రతిష్ట తరలివచ్చారు. పండుగ వాతావరణం మధ్య, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మొత్తం శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట ఫొటోలు వైరల్‌ అయ్యాయి. అయితే మోసగాళ్లు ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు మిస్‌ చేసుకోవాలని అనుకున్నట్లు ఉన్నారు. రామమందిర ప్రారంభం సందర్భంగా మోదీ-యోగి ప్రభుత్వం రూ.749 రీచార్జ్‌ ఫ్రీగా ఇస్తున్నారని, దాన్ని పొందాలంటే మాత్రం ఓ లింక్‌ను క్లిక్‌ చేయాలని సూచిస్తూ ఓ మెసేజ్‌ వాట్సాప్‌లో హల్‌చల్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మెసేజ్‌ ఆధారంగా నిజంగా రీచార్జ్‌ వస్తుందా? టెక్‌ నిపుణులు ఏం చెబుతున్నారో? ఓ సారి తెలుసుకుందాం.

ఒక వాట్సాప్ వినియోగదారుడికి ఒక లింక్‌ను షేర్ చేశారు. “రామమందిర్ ఆఫర్: జనవరి 22న అయోధ్యలో రామమందిర స్థాపనను పురస్కరించుకుని మోడీ మరియు యోగి మొత్తం దేశానికి 749 రూపాయల ఉచిత రీఛార్జ్‌ను అందిస్తున్నారు. బ్లూ కలర్‌లో కింది లింక్‌పై క్లిక్ చేసి రీఛార్జ్ చేయండి. అని ఉంది. అయితే మెసేజ్‌ అంటే ఉచిత రీఛార్జ్ క్లెయిమ్ నకిలీదని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరల్ పోస్ట్ వెనుక ఉన్న నిజాన్ని నిర్ధారించడానికి గూగుల్‌ కీవర్డ్ శోధనలను నిర్వహించారు. అయితే వాగ్దానం చేసిన ఉచిత రీఛార్జ్‌కు సంబంధించిన సమాచారం రాలేదు.

అలాగే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాలపై తదుపరి తనిఖీలు క్లెయిమ్ చేసిన ఆఫర్‌కు సంబంధించిన ఫలితాలను ఇవ్వలేదు. జియోకు సంబధించిన అధికారిక వెబ్‌సైట్‌లలో కూడా ఇలాంటి ఆఫర్ గురించిన వివరాలను లేవు. కాబట్టి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వైరల్ లింక్ మోసపూరితమైందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ లింక్‌ను క్లిక్‌ చేస్తే మీ వ్యక్తిగత వివరాలు తస్కరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..