Flipkart Sale: స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఐ ఫోన్ నుంచి గూగుల్ పిక్సల్ వరకూ.. సమయం లేదు త్వరపడండి..

|

May 21, 2023 | 5:00 PM

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ మరో సేల్ తో ముందుకొచ్చింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ 2023 పేరిట దీనిని తీసుకొచ్చింది. కొనుగోలుదారులకు అన్ని వస్తువులపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై గతంలో ఎన్నడూ లేని విధంగా డిస్కౌంట్లు ప్రకటించింది.

Flipkart Sale: స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఐ ఫోన్ నుంచి గూగుల్ పిక్సల్ వరకూ.. సమయం లేదు త్వరపడండి..
Google Pixel 7a
Follow us on

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ మరో సేల్ తో ముందుకొచ్చింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ 2023 పేరిట దీనిని తీసుకొచ్చింది. కొనుగోలుదారులకు అన్ని వస్తువులపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై గతంలో ఎన్నడూ లేని విధంగా డిస్కౌంట్లు ప్రకటించింది. గూగుల్ పిక్సల్ 7ఏ దగ్గర నుంచి ఐఫోన్ 14 వరకూ అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన తగ్గింపును అందిస్తోంది. ఈ సేల్ మే 19 నుంచి ప్రారంభమైంది. మే 21 అర్ధరాత్రి వరకూ ఆఫర్లు ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆపిల్ ఐఫోన్ 14..

128 జీబీ వేరియంట్ ఆపిల్ ఐ ఫోన్ రూ. 69,999 వరకూ ఉంది. దీనిని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా, కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్ ఛేంజ్ చేస్తే ₹ 33,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అది మీరు ఎక్స్ ఛేంజ్ చేస్తున్న ఫోన్ ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ డిస్‌ప్లే ఉంది . ఫోన్ స్క్రీన్ 2532×1170 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. యాపిల్ ఏ15 బయోనిక్ చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది.

గూగుల్ పిక్సల్ 7ఏ..

ఇటీవల కొత్తగా ఆవిష్కరించిన ఈ గూగుల్ పిక్సల్ ఫోన్ ధర రూ. 43,999. అయితే కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించడంపై కస్టమర్‌లు 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా, కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్ ఛేంజ్ చేయడం ద్వారా రూ. 34,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ లో 6.1-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. స్క్రీన్ కి గొరిల్లా గ్లాస్ 3 సంరక్షణ ఉంటుంది. ఫోన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ని కలిగి ఉంది. సరికొత్త టెన్సర్ జీ2 ఎస్ఓసీ ఆధారంగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

పోకో ఎఫ్5 5జీ..

ఈ ఫోన్ 8జీబీ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. అయితే కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించడంపై కస్టమర్‌లు 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ స్క్రీన్‌ను కలిగి ఉంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 ప్లస్ జెన్ 2 చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది.

ఒప్పో రెనో 8 ప్రో 5జీ..

12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తున్న ఈ ఫోన్ దర రూ. 45,999గా ఉంది. దీనిని కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి కొనుగోలు చేస్తే కస్టమర్‌లు 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్లో మీడియా టెక్ డైమెన్సిటీ 8100 మాక్స్ ప్రాసెసర్‌ ఉంటుంది. 6.7-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

వివో టీ1ఎక్స్..

4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీతో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 12,999గా ఉంది. దీనిని కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి కొనుగోలు చేస్తే కస్టమర్‌లు 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా, కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్ ఛేంజ్ చేస్తే దాదాపు రూ.12,450 తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది 6.58-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ కలిగి ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..