vivo T2 Pro 5G: సేల్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 5 వేలకిపైగా..

వివో టీ2 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌ అలసు ధర రూ. 27,999కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఫ్లిప్‌ కార్ట్‌ 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను 128జీబీ స్టోరేజ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్‌ను రూ. 23,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ ఇక్కడితోనే ఆగిపోలేదు. ఈ ఫోన్‌ను ఎస్‌బీఐ బ్యాంకుకు చెందిన కార్డుతో కొనుగోలు చేస్తే సుమారు రూ. 3వేల వరకు...

vivo T2 Pro 5G: సేల్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 5 వేలకిపైగా..
Vivo T2 Pro 5g
Follow us

|

Updated on: May 02, 2024 | 4:01 PM

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం బిగ్‌ సేవింగ్ డేస్‌ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలు స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా వివో స్మార్ట్ ఫోన్‌పై భారీ డీల్‌ లభిస్తోంది. వివో టీ2 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌పై భారీ డీల్‌ను లభిస్తోంది. సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 5వేలకిపైగా డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఇంతకీ ఈ ఫోన్‌పై ఎలాంటి డిస్కౌంట్స్‌ లభిస్తున్నాయి.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వివో టీ2 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌ అలసు ధర రూ. 27,999కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఫ్లిప్‌ కార్ట్‌ 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను 128జీబీ స్టోరేజ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్‌ను రూ. 23,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ ఇక్కడితోనే ఆగిపోలేదు. ఈ ఫోన్‌ను ఎస్‌బీఐ బ్యాంకుకు చెందిన కార్డుతో కొనుగోలు చేస్తే సుమారు రూ. 3వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 20 వేలకే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు ఎక్స్జేంచ్‌ ఆఫర్‌ కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్‌పై గరిష్టంగా రూ. 20 వేల వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 3 వేలకే పొందొచ్చు.

ఇక వివో టీ20 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇక ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ కెమెరాను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే ఇందులో 3600 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 3డీ కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles