ఫ్లిఫ్‌కార్ట్‌ ఇండిపెండెన్స్‌ డే సేల్.. ఐఫోన్‌ సహా ప్రముఖ బ్రాండ్‌లపై భారీ తగ్గింపు!

ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్ ఫ్లిఫ్‌కార్ట్‌ తన వినియోగదారులకు మరో సేల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్‌లో మీరు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లపై గొప్ప ఆఫర్స్‌ను పొందవచ్చు. ఇటీవలే ఫ్రీడమ్‌ సేల్‌ పేరుతో పలు రకాల మొబైల్స్‌ పై భారీ ఆఫర్స్‌ తెచ్చిన ఫ్లిఫ్‌కార్టు తాజాగా మరో సేల్‌ను తీసుకురావడం గమనార్హం. ముఖ్యంగా ఈ సేల్‌లో ఐఫోన్‌, ఇతర బ్రాండెడ్‌ ఫోన్‌పై ప్లిఫ్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్లను తీసుకొచ్చింది. అయితే ఈ సేల్‌ ఆఫర్స్‌ ఏంటో చూద్దాం పదండి.

ఫ్లిఫ్‌కార్ట్‌ ఇండిపెండెన్స్‌ డే సేల్.. ఐఫోన్‌ సహా ప్రముఖ బ్రాండ్‌లపై భారీ తగ్గింపు!
Flipkart Independence Day S

Edited By: TV9 Telugu

Updated on: Aug 18, 2025 | 12:04 PM

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో స్వాతంత్ర్య దినోత్సవ సేల్ ప్రారంభమైంది. గడిచిన నెల రోజుల్లో ఈ-కామర్స్ దిగ్గజం నిర్వహిస్తున్న రెండవ స్వాతంత్ర్య దినోత్సవ సేల్‌ ఇది. ఇటీవలే ఆగస్టు 1 నుండి ఆగస్టు 8 వరకు ఫ్లిఫ్‌కార్టు తన కస్టమర్ల కోసం ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించి అనే ఆఫర్లను తీసుకొచ్చింది. తాజాగా ఇప్పుడు మరోసారి తన కస్టమర్ల కోసం కొత్త సేల్‌ను ప్రారంభించింది, దీనిలో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, గ్యాజేట్స్‌, ల్యాప్‌టాప్‌లు వంటి వాటిపై అదిరిపోయే డీల్స్‌ను అందుబాటులో తెచ్చింది.

ఈ సేల్ సమయంలో, ఆపిల్‌, మోటరోలా, నథింగ్, ఒప్పో, వివో వంటి బ్రాండ్లకు సంబంధించిన ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ ఉన్నాయి. అయితే సేల్‌కు ముందు, ఫ్లిప్‌కార్ట్ కొన్ని స్మార్ట్‌ఫోన్ డీల్‌లను ప్రకటించింది. వాటిలో ఒప్పో నుంచి రెండు ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఒప్పో K13 5G లాంచ్‌ అయినప్పుడు ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 17,999 ఉండగా ప్రస్తుతం సేల్‌లో ఇది కేవలం రూ. 15,999 కు లభిస్తుంది. దీనితో పాటు ఒప్పో K13x 5G కూడా కేవలం రూ. 10,999కే అందుబాలులో ఉంది.

అయితే ఈ సేల్‌ మరిన్ని ఫోన్స్‌పై కూడా ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్స్‌ తీసుకొచ్చినట్టు చెబుతోంది. కానీ వాటి ధరలను మాత్రం ఇంకా రివీల్‌ చేయలేదు. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో వచ్చే మరిన్ని ఫోన్‌ల వివరాలు చూసుకుంటే.. Samsung Galaxy S24, Vivo T4 5G, Realme P3 5G, iPhone 16, Motorola Edge 60 Fusion, Samsung Galaxy S24 FE, నథింగ్ ఫోన్ 2 ప్రో వంటి అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

ఐఫోన్ 16 పై భారీ డిస్కౌంట్

గత ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో ఐఫోన్ 16పై భారీ డిస్కైంట్‌ వచ్చింది. అప్పుడు ఆఫర్‌లో ఐఫోన్‌ 16 ధర రూ.69,999కి నిర్ణయించబడింది. ఇది ఐఫోన్‌ లాంచ్‌ అయినప్పుడు ఉన్న ప్రారంభ ధర కంటే చాలా తక్కువ. అయితే గత ఫీడమ్‌ సేల్‌లో కొన్ని ఫోన్స్‌పై ఉన్న ఆఫర్స్‌ ఈ సేల్‌లో కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది. గత సేల్‌లో ఉన్న ఆఫర్స్‌ చూసుకుంటే.. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ గత సేల్‌లో రూ.20,999కి అందుబాటులో ఉంది. సేల్ సమయంలో Samsung Galaxy S24 రూ.46,999కి, Galaxy S24 FE రూ.49,999కి అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.