INS Vikrant – Infographic: తొలి స్వదేశీ యుద్ధ విమాన వాహక నౌక .. ఇన్ఫోగ్రఫిక్స్‌లో వివరాలు

|

Aug 06, 2021 | 2:13 PM

INS Vikrant: భారత నావికా దళం మునుపెన్నడూ లేనంత స్థాయికి బలోపేతంకానుంది. భారత్ తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ త్వరలోనే భారత నావికా దళంలో చేరనుంది.

INS Vikrant - Infographic: తొలి స్వదేశీ యుద్ధ విమాన వాహక నౌక .. ఇన్ఫోగ్రఫిక్స్‌లో వివరాలు
Indian Navy 4
Follow us on

INS Vikrant: భారత నావికా దళం మునుపెన్నడూ లేనంత స్థాయికి బలోపేతంకానుంది. భారత్ తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ త్వరలోనే భారత నావికా దళంలో చేరనుంది. దీనికి సంబంధించిన సన్నాహక పరీక్షలు రెండ్రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. విక్రాంత్ తొలి సముద్ర పరీక్షలు నిర్వహించడం చారిత్రక ఘట్టంగా భారత నావికా దళ అధికారులు అభివర్ణిస్తున్నారు.

860 మీటర్ల పొడవు, 203 మీటర్ల వెడల్పు, 45 వేల మెట్రిక్ టన్నుల బరువున్న దీన్ని భారత నౌకాదళానికి చెందిన నావల్ డిజైన్ డైరెక్టరేట్ రూపొందించింది. దీని రూపకల్పనతో విమాన వాహక నౌకల తయారీ, రూపకల్పన దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. వచ్చే ఏడాది ఆగస్టులో దీన్ని భారత నౌకా దళంలోకి లాంఛనంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

ఐఎన్ఎస్ విక్రాంత్ వివరాలను ఇక్కడ ఇన్ఫోగ్రఫిక్స్‌లో చూడండి.