Facebook Virtual Reality: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో ఫేస్‌బుక్‌ మరో అద్భుతం.. హారిజాన్‌ వర్క్‌ రూమ్‌ పేరుతో.

Facebook Virtual Reality: కరోనా కారణంగా అన్ని రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చాయి. మరీ ముఖ్యంగా కరోనా కారణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ బాగా పెరిగిపోయింది. గతంలో ఎన్నడూ ఈ విధానాన్ని...

Facebook Virtual Reality: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో ఫేస్‌బుక్‌ మరో అద్భుతం.. హారిజాన్‌ వర్క్‌ రూమ్‌ పేరుతో.
Facebook

Updated on: Aug 21, 2021 | 5:25 PM

Facebook Virtual Reality: కరోనా కారణంగా అన్ని రంగాల్లో సమూల మార్పులు తీసుకొచ్చాయి. మరీ ముఖ్యంగా కరోనా కారణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ బాగా పెరిగిపోయింది. గతంలో ఎన్నడూ ఈ విధానాన్ని అవలంభించని కపెంనీలు సైతం ఇప్పుడు అనివార్యంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ విధానాన్ని పాటించక తప్పని పరిస్థితులు వచ్చాయి. దీంతో రకరకాల వీడియో కాలింగ్‌ యాప్‌లకు డిమాండ్‌ పెరిగింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌కు అనుగుణంగా యాప్‌లలో ఫీచర్లను జోడిస్తున్నాయి కంపెనీలు. ఇందులో భాగంగానే అధునాతన ఫీచర్లను యాడ్‌ చేస్తున్నాయి. తాజాగా ఫేస్‌బుక్‌ వర్క్‌ ఫ్రమ్‌ కల్చర్‌లో మరో అద్భుతానికి తెర తీసింది.

ఎంత వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అయినా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మీటింగ్‌లకు సంబంధించి కాస్త కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వచ్చే పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనిని అధిగమించడానికే ఫేస్‌బుక్‌ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హారిజాన్‌ వర్క్‌ రూమ్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మనం ఎక్కడ ఉన్నా అందరితో కలిసి పనిచేస్తున్న భావన కలుగుతుంది. మీ సహోద్యోగులతో కలిసి సమావేశానికి హాజరు అయినట్లు, తరగతి గదిలో తోటి విద్యార్థులతో ఉన్నట్లు ఫీలింగ్‌ కలుగుతుంది. వీఆర్‌ టెక్నాలజీతో ఈ సదుపాయాన్ని కలిపించనున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఫేస్‌బుక్‌ ఈ కొత్త టెక్నాలజీని అధికారికంగా తీసుకురానుంది. మరి ఈ కొత్త టెక్నాలజీతో మరెన్ని సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.

Also Read: Jogi Ramesh: ‘టీడీపీ అంటే తెలుగు తాలిబన్ పార్టీ’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్

AP Weather Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు

Mouse Glue Pads: ఎలుకలను పట్టేందుకు ఉపయోగించే గ్లూ ట్రాప్‌లపై నిషేధం విధించిన తెలంగాణ ప్రభుత్వం.. కారణమేంటో తెలుసా.?