Facebook: మెటా యాజమాన్యంలోని ఫేస్‌బుక్ గ్రూప్ మెంబర్‌ల మధ్య తప్పుడు సమాచారం లేదా ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు గ్రూప్ అడ్మిన్ల కోసం కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. ఫేస్‌బుక్ గ్రూప్ అడ్మిన్ల (Facebook Group Admin) కోసం వారు మరిన్ని ఫీచర్లను జోడించినట్లు కంపెనీ తెలిపింది. థర్డ్ పార్టీ ఫ్యాక్ట్-చెకర్స్ (Fact-Checkers) ద్వారా తప్పుడు సమాచారాన్ని గుర్తించి ఇన్‌కమింగ్ పోస్ట్‌లను ఆటోమేటిక్‌గా తిరస్కరించే ఫీచర్ వంటిది. Facebook గ్రూప్ అడ్మిన్‌లు తమ గ్రూప్‌లను సురక్షితంగా ఉంచుకోవడం, తప్పుడు సమాచారాన్ని అరికట్టడం, కనెక్ట్ చేయబడిన ప్రేక్షకులతో తమ గ్రూప్‌లను నిర్వహించడం, అలాగే సులభమైన మార్గాల కోసం కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నామని కంపెనీ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.
ఈ కొత్త ఫీచర్‌లు అడ్మిన్‌లు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సహాయపడతాయి. అలాగే తప్పుగా గుర్తించబడిన పోస్టులను అడ్మిన్ తొలగించేందుకు ఆస్కారం ఉంటుంది. థర్డ్-పార్టీ ఫ్యాక్ట్ చెకర్స్ ద్వారా అప్‌ఫెల్డ్ చేయబడిన ఇన్‌కమింగ్ పోస్ట్‌లు గ్రూప్‌లలో వీక్షించే ముందు తిరస్కరించబడతాయి. ఇది తప్పుడు సమాచారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి: