Antarctic Ice slabs: ఈ మంచు గడ్డ వయస్సు 20 లక్షల సంవత్సరాలు.. పరిశోధకులు ఎలా కనుగొన్నారంటే..

|

Feb 15, 2023 | 1:45 PM

అందులో భాగంగా ఓ అంటార్కిటికాలోని ఓ రంధ్రం ద్వారా 93 మీటర్ల లోతు వరకూ కెమెరాను పంపి దానిని అన్వేషించగలిగారు. దీనిని రికార్డు చేసిన పరిశోధకులు ఆ మంచు పలకలు 20 లక్షల సంవత్సరాల క్రితం నాటివని నిర్ధారించారు.

Antarctic Ice slabs: ఈ మంచు గడ్డ వయస్సు 20 లక్షల సంవత్సరాలు.. పరిశోధకులు ఎలా కనుగొన్నారంటే..
Iceberg
Follow us on

మీలో చాలా మంది టైటానిక్ సినిమా చూసి ఉంటారు. సాధారణంగా టైటానిక్ అనగానే అద్భుత ప్రేమ కావ్యంగానే అందురూ గుర్తుపెట్టుకుంటారు. కానీ దానిలో అంతపెద్ద షిప్ మునిగిపోవడానికి కారణమైన మంచు కొండ గురించి పెద్దగా పట్టించుకోరు. అంత పెద్ద షిప్ మునిగిపోవడానికి కారణమైన ఆ మంచు కొండ ఎంత పెద్దది కాకపోతే అప్పటికి ప్రపంచంలో అతిపెద్దదైన టైటానిక్ ని ముంచేస్తుంది చెప్పండి. ఇదే క్రమంలో చాలా ఏళ్లుగా మంచు కొండలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. అంటార్కిటికా వంటి ప్రాంతాలలో మంచు కొండలు ఎప్పటి నుంచి అక్కడ ఉన్నాయి? వాటి వల్ల వాతావరణానికి ఒనగూరిన ప్రయోజనాలు, ప్రభావాలు ఏంటి అన్న అంశాలపై ఇప్పటికీ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో అంటార్కిటికాలోని ఓ పరిశోధకుల బృందం దాదాపు రెండు మిలియన్(20 లక్షలు) సంవత్సరాల నాటి మంచు పలకలను కనుగొన్నారు.

కోల్డెక్స్ ప్రాజెక్టులో భాగంగా..

ఈ పరిశోధన సెంటర్ ఫర్ ఓల్డెస్ట్ ఐస్ ఎక్స్‌ప్లోరేషన్ (కోల్డెక్స్) ప్రాజెక్ట్‌లో భాగంగా అంటార్కిటికాలో ఈ పరిశోధనలు నిర్వహించారు.  ప్రస్తుతం 800,000 సంవత్సరాల క్రితం నాటి మంచు పలకలు మాత్రమే పరిశోధకులు గుర్తించగలిగారు. ఇప్పటి వరకూ ఇదే మంచు కోర్ రికార్డు గా ఉంది. దీనిని 3 మిలియన్ సంవత్సరాలకు విస్తరించడమే లక్ష్యంగా పరిశోధనలు ఈ ప్రాజెక్టు చేపట్టారు. అందులో భాగంగా ఓ అంటార్కిటికాలోని ఓ రంధ్రం ద్వారా 93 మీటర్ల లోతు వరకూ కెమెరాను పంపి దానిని అన్వేషించగలిగారు. దీనిని రికార్డు చేసిన పరిశోధకులు ఆ మంచు పలకలు 20 లక్షల సంవత్సరాల నాటివని నిర్ధారించారు. అంటార్కిటికాలో మంచు నమూనాలను సేకరించే పరిశోధనా బృందంలో ఒకరైన పీహెచ్డీ విద్యార్థి ఆస్టిన్ కార్టర్ ఈ వీడియోను రికార్డు చేసి, విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

ఏమిటీ కోల్డెక్స్ ప్రాజెక్టు?

కోల్డెక్స్ ప్రాజెక్టు అంటే ఇది నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్)చే నిర్వహించబడుతుంది. 2021లో దీనిని ప్రారంభించారు. భూమి, వాతావరణం, పర్యావరణ చరిత్ర, పురాతన మంచు కోర్ రికార్డుల కోసం దీనిని నిర్వహిస్తున్నారు. ఈ పరిశోధనలో యూరప్, ఆస్ట్రేలియా, యుఎస్ నుంచి పాలియోక్లిమటాలజిస్ట్‌ల కొత్త బృందం కోల్డెక్స్ లో చేరి అంటార్కిటికాకు వెళ్లింది.

ఎందుకీ అన్వేషణ?

పురాతన మంచు నమూనాలను ఎందుకు అన్వేషించాలి? అన్న ప్రశ్నకు నిపుణులు ఈ విధంగా సమాధానం చెబుతున్నారు. కాలక్రమేణా సంభవించిన వాతావరణ మార్పుల స్థాయిని నిర్ణయించడానికి ధ్రువ శాస్త్రంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పాత మంచు నమూనాలలో గాలి బుడగలు లాక్ చేయబడి ఉంటాయి. ఇవి కార్బన్ డయాక్సైడ్ స్థాయిలలో మార్పు, అవి ఉపరితల ఉష్ణోగ్రతలను ఎలా మార్చాయో అర్థం చేసుకోవడంలో సహాయపడతాయని సైంటిఫిక్ అమెరికన్ తెలిపింది. పురాతన మంచును అన్వేషించడం మిలియన్ల సంవత్సరాల క్రితం గ్రీన్హౌస్ వాయువు స్థాయిలను కొలవడానికి కూడా సహాయపడుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..