Emojis Colour: ఎమోజీలు పసుపు రంగుల్లో ఎందుకు ఉంటాయి..? కారణం ఏమిటి..?

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరిగిపోయింది. అందులో ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాలా మంది చాటింగ్‌లతో మునిగితేలిపోతున్నారు. ఇక మెసేజింగ్‌ యాప్‌లు..

Emojis Colour: ఎమోజీలు పసుపు రంగుల్లో ఎందుకు ఉంటాయి..? కారణం ఏమిటి..?
Emojis

Updated on: Nov 02, 2022 | 5:25 AM

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరిగిపోయింది. అందులో ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాలా మంది చాటింగ్‌లతో మునిగితేలిపోతున్నారు. ఇక మెసేజింగ్‌ యాప్‌లు ఎన్ని ఉన్నా.. ఎమోజీలు మాత్రం కామన్‌గా ఉంటాయి. అవతలి వాళ్లు ఎంత పెద్ద మెసేజ్‌ రాసినా.. సింపుల్‌గా ఒక్క సింబల్‌తో అర్థాన్ని చెప్పే సత్తా ఒక్క ఎమోజీలకు ఉంది. ఇప్పుడు ఫోన్‌లో కాల్ చేయడంతో పాటు చాట్ చేయడం కూడా ట్రెండ్‌ అయిపోయింది. ఈ చాటింగ్‌లో పదాలతో పాటు మీ వ్యక్తీకరణలను జోడించడానికి ఎమోజీలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎమోజీ ద్వారా మీరు చాటింగ్ ద్వారా మీ భావాలను కూడా వ్యక్తపరచవచ్చు. అలాగే మీరు సంతోషంగా ఉన్నారా లేదా మీ మనసులో ఏముందో అనే దానిని ఈ ఒక్క ఎమోజీతో చెప్పవచ్చు. చాటింగ్ సమయంలో మీరు కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయతే ఈ ఎమోజీల రంగు పసుపు ఎందుకు ఉంటుందనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా..? ఇలా పసుపు రంగు ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం.

ఎమోజీ ట్రెండ్ ఎలా మొదలైందిలా..

ఎమోజీ 1963 సంవత్సరం నుంచి అందుబాటులో ఉన్నట్లు కథనాలు ఉన్నాయి. మొదట ఒక కంపెనీ ఉద్యోగుల మనోబలాన్ని పెంచడానికి ఉపయోగించబడిందని చెబుతుంటారు. ఒకప్పుడు స్టేట్ మ్యూచువల్ లైఫ్ అస్యూరెన్స్ కంపెనీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కంపెనీ ఉద్యోగుల్లో ధైర్యాన్ని పెంచడానికి ఒక గ్రాఫిక్ డిజైనర్‌ని నియమించింది. అతను ఒక చిహ్నాన్ని రూపొందించాడు. ఈ చిహ్నం పసుపు రంగులో తయారు చేశాడు. దానిపై స్మైలీ ముఖంలా తయారు రూపొందించారు. ఇది ఈ స్మైలీ ఎమోజీ ఉద్యోగులపై మంచి ప్రభావాన్ని చూపింది. ఎమోజీని మొదట సృష్టించినప్పుడు అది పసుపు రంగులో మాత్రమే ఉంది. అంటే ఎమోజీ పసుపు రంగుతో ప్రారంభమైందని చెప్పవచ్చు. వాస్తవానికి, అంతకుముందు దీనిని హ్యాపీ ఫేస్ కోసం ఉపయోగించారట. కానీ ఇప్పుడు అనేక రకాల ఎమోజీలు తయారు చేయబడ్డాయి. ఇంతకు ముందు ఎమోజీ ఆనందం వ్యక్తం చేయడానికి ఉపయోగించారు. అది కూడా ఒక వ్యక్తి ముఖ కవళిక రూపంలో తయారు చేశారు.

పసుపు రంగు మాత్రమే ఎందుకు..?

ఎమోజీలు పసుపు రంగులో ఉండడానికి వివిధ రకాల కారణాలున్నాయి. పసుపు రంగు ఆనందంతో ముడిపడి ఉంటుంది. అలాగే సూర్యుడితో కలిసినప్పుడు అది ఆనందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో పసుపు రంగు దానితో ముడిపడి ఉందని గుర్తించి పసుపు రంగులోనే ఉంచారు. అలాగే శ్రద్ద, సానుకూల అనుభూతిని వ్యక్తి చేసేలా ఉంటుంది. అందుకే ఎమోజీలు పసుపు రంగులో తయారు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి