Twitter CEO News: ఎలన్ మస్క్ కు ఈ-మెయిల్ సృష్టికర్త ఆఫర్.. సీఈఓ పోస్ట్ కు రెడీ అంటూ ప్రకటన

| Edited By: Ravi Kiran

Dec 26, 2022 | 8:25 PM

యూజర్లు మస్క్ కు మస్కా కొడుతూ సీఈఓ ఉండడానికి నువ్వు అనర్హుడవంటూ 57.5 శాతం మంది తెలిపారు. ఈ ఊహించని రిజల్ట్ తో కంగుతిన్న మస్క్ త్వరలోనే తాను త్వరలోనే సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని, ఎవరైనా ఫూలిష్ పర్స్ న్ వస్తే తాను సిద్ధమని ప్రకటించాడు. అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లోని కొన్ని కీలక విభాగాలను కొనసాగిస్తానని చెప్పారు.

Twitter CEO News: ఎలన్ మస్క్ కు ఈ-మెయిల్ సృష్టికర్త ఆఫర్.. సీఈఓ పోస్ట్ కు రెడీ అంటూ ప్రకటన
Twitter
Follow us on

ఎలన్ మస్క్..గతంలో ప్రపంచలోనే అత్యంత ధనవంతుడు. ఎప్పడైతే ట్విట్టర్ కొనుగోలు అంశంలో తలదూర్చాడో క్రమేపి మస్క్ తన ప్రాబవాన్ని కోల్పోతున్నాడు. ఎప్పుడైతే ట్విట్టర్ ను కొనుగోలు చేసి సీఈఓ అయ్యాడో అప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఉద్యోగుల తొలగింపు అంశం అతనిపై తీవ్ర నెగటివ్ ప్రచారానికి కారణమైంది. తాజాగా తాను ట్విట్టర్ సీఈఓగా ఉండాలా? వద్దా? అని ఆన్ లైన్ పోల్ నిర్వహించారు. దీంతో యూజర్లు మస్క్ కు మస్కా కొడుతూ సీఈఓ ఉండడానికి నువ్వు అనర్హుడవంటూ 57.5 శాతం మంది తెలిపారు. ఈ ఊహించని రిజల్ట్ తో కంగుతిన్న మస్క్ త్వరలోనే తాను త్వరలోనే సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని, ఎవరైనా ఫూలిష్ పర్స్ న్ వస్తే తాను సిద్ధమని ప్రకటించాడు. అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లోని కొన్ని కీలక విభాగాలను కొనసాగిస్తానని ఎలన్ మస్క్ తెలిపాడు.

ఎలన్ మస్క్ షాక్ ఇస్తూ ఓ ఇండో అమెరికన్ తాను సీఈఓ పోస్ట్ కు సిద్ధమంటూ ప్రకటించాడు. ఈ-మెయిల్ సృష్టికర్త శివ అయ్యదురై తాను ట్విట్టర్ సీఈఓ పదవిపై ఆసక్తిగా ఉన్నాను అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. తాను ప్రతిష్టాత్మక ఎంఐటీ నుంచి నాలుగు డిగ్రీలు పొందానని, ఏడు హైటెక్ సాఫ్ట్ వేర్ కంపెనీలను సృష్టించానని పేర్కొన్నాడు. దయచేసి ఎలా దరఖాస్తు చేయాలో? తెలపాలని కోరాడు. 

1978లో అయ్యదురై ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్‌ని సృష్టించాడు, దానిని అతను “ఈ-మెయిల్” అని పిలిచాడు.ఈ ప్రోగ్రామ్ ఇంటర్‌ఆఫీస్ మెయిల్ సిస్టమ్ లో అన్ని ఫంక్షన్‌లను ప్రతిరూపం చేసింది. దీంతో 1982, ఆగష్టు 30న, యూఎస్ ప్రభుత్వం అయ్యదురైని ఈ-మెయిల్ సృష్టికర్తగా అధికారికంగా గుర్తించి, కాపీరైట్‌ను అందజేసింది. అయ్యదురై బొంబాయిలోని ఒక తమిళ కుటుంబంలో జన్మించాడు. అతను ఏడేళ్ల వయసులో యూఎస్ కు వెళ్లాడు. అయితే శివ అయ్యదురై ఆఫర్ పై మస్క్ ఎలా స్పందిస్తాడో? వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి