Mobile: మీరు ఉప‌యోగిస్తున్న ఫోన్‌ ఛార్జ‌ర్ అస‌లా, న‌కిలీనా.? ఇలా తెలుసుకోండి..

|

Aug 02, 2024 | 4:08 PM

మ‌రీ ముఖ్యంగా ఒరిజిన‌ల్ కంపెనీకి చెందిన ఛార్జ‌ర్స్ ఖ‌రీదు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో త‌క్కువ ధ‌ర ఉండే ట్రావెలింగ్ ఛార్జ‌ర్ల‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే వీటివ‌ల్ల మీ స్మార్ట్ ఫోన్ పాడ‌య్యే ప్ర‌మాదం ఉంటుంది. వేలు పెట్టి కొనుగోలు చేసే స్మార్ట్ ఫోన్‌, వంద‌ల ఖ‌ర్చులో ఉండే ఛార్జ‌ర్స్ వ‌ల్ల ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం..

Mobile: మీరు ఉప‌యోగిస్తున్న ఫోన్‌ ఛార్జ‌ర్ అస‌లా, న‌కిలీనా.? ఇలా తెలుసుకోండి..
Follow us on

స్మార్ట్ ఫోన్ వినియోగం ప్ర‌స్తుతం అనివార్యంగా మారింది. ప్ర‌తీ ఒక్క‌రి చేతిలో ఫోన్ ఉండాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ప్ర‌తీ చిన్న అవ‌స‌రానికి స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. అయితే స్మార్ట్ ఫోన్ ఉప‌యోగించే ప్ర‌తీ ఒక్క‌రూ ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో ఛార్జింగ్ ప్ర‌ధాన‌మైంది. సాధార‌ణంగా ఫోన్‌తో వ‌చ్చే ఛార్జ‌ర్స్ కొన్ని రోజుల త‌ర్వాత పాడ‌వుతుంది. దీంతో మార్కెట్లో ల‌భించే ఏదో ఒక చార్జ‌ర్‌ను కొనుగోలు చేస్తుంటారు.

మ‌రీ ముఖ్యంగా ఒరిజిన‌ల్ కంపెనీకి చెందిన ఛార్జ‌ర్స్ ఖ‌రీదు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో త‌క్కువ ధ‌ర ఉండే ట్రావెలింగ్ ఛార్జ‌ర్ల‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే వీటివ‌ల్ల మీ స్మార్ట్ ఫోన్ పాడ‌య్యే ప్ర‌మాదం ఉంటుంది. వేలు పెట్టి కొనుగోలు చేసే స్మార్ట్ ఫోన్‌, వంద‌ల ఖ‌ర్చులో ఉండే ఛార్జ‌ర్స్ వ‌ల్ల ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంటుంది. అయితే మార్కెట్లో డుప్లికెట్ ఛార్జ‌ర్స్ కూడా ఎక్కువుతున్నాయి. ఇంత‌కీ మీరు ఉప‌యోస్తున్న ఛార్జ‌ర్ ఒరిజిన‌లా కాదా అనే విషయాన్ని తెలుసుకోవ‌డానికి కొన్ని టిప్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వఛార్జ‌ర్ వెన‌కాల డ‌బుల్ స్క్వేర్ సింబ‌ల్ ఉన్న‌ట్ల‌యితే.. మొబైల్ ఛార్జర్ లోపల ఉపయోగించిన వైరింగ్ డబుల్ ఇన్సులేట్ చేశార‌ని అర్థం. ఈ ఛార్జర్‌లో షార్ట్ స‌ర్క్యూట్ అయ్యే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి ఈ ఛార్జ‌ర్‌ను ఉప‌యోగించ‌డం సుర‌క్షిత‌మ‌ని అర్థం.

* ఒక‌వేళ చార్జ‌ర్‌పై ఉండే V లెట‌ర్‌.. ఇది ఛార్జ‌ర్ ప‌రవ‌ర్ కెపాసిటీని సూచిస్తుంది. ఇది ఛార్జర్ ఐదు ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అర్థం. ఛార్జ‌ర్‌ల సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి ఈ నెంబ‌రింగ్ ఉంటుంది.

* ఒక‌వేళ ఛార్జ‌ర్‌పై హౌజ్ (ఇంటి) సింబ‌ల్ క‌నిపిస్తే.. ఆ ఛార్జ‌ర్ కేవ‌లం వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోస‌మేన‌ని అర్థం చేసుకోవాలి. అందుకే ఈ ఛార్జ‌ర్‌ను అధిక వోల్టేజ్ ఉన్న ప్ర‌దేశాల్లో ఉప‌యోగించ‌కూడ‌దు. ఇలా చేస్తే ఫోన్ పాడ‌య్యే అవ‌కాశం ఉంటుంది.

* ఇక ఛార్జ‌ర్స్‌పై 8 గుర్తు రాసి ఉండ‌డాన్ని గ‌మ‌నించే ఉంటారు. ఇది మీ ఛార్జ‌ర్ అన్ని భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఉంద‌ని అర్థం. మెరుగైన ప‌నితీరుతో మీ ఛార్జ‌ర్ త‌యారు చేశార‌ని అర్థం చేసుకోవాలి. ఇది నాణ్య‌మైన ఛార్జ‌ర్ అని అర్థం.

* కొన్ని ఛార్జ‌ర్స్‌పై క్రాస్ డ‌స్ట్ బిన్ సింబ‌ల్స్ కూడా ఉంటాయి. దీని అర్థం ఈ ఛార్జ‌ర్ పాడైతే డ‌స్ట్ బిన్‌లో వేయకూడ‌ద‌ని అర్థం చేసుకోవాలి. ఇది రీసైక్లింగ్ చేసే ఛార్జ‌ర్ అని అర్థం.

మ‌రిన్ని టెక్నాల‌జీ వార్త‌ల కోసం క్లిక్ చేయండి…